Funny Video: సోషల్ మీడియాలో అనేక ఛాలెంజ్ లను మీరు చూసే ఉంటారు. ఈ ఛాలెంజ్‌లు కొన్నిసార్లు వీడియోల రూపంలోనూ, కొన్నిసార్లు ఫొటోల రూపంలోనూ ఉంటాయి. మేము అలాంటి కొన్ని చిత్రాలు లేదా వీడియోలను చూసి.. కొన్ని సార్లు గందరగోళానికి గురవుతుంటాం. అయితే అలాంటి ఛాలెంజ్ లలో చాలా మంది గెలిచే ఉంటారు. కానీ, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ ఛాలెంజ్ ను ఎదుర్కొవడం చాలా కష్టం. ఆ వీడియోలో ఓ జంతువు ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే అందులో ఏ జంతువు ఉందో కనిపెట్టే విషయంలో చాలామంది పప్పులో కాలేశారు. కానీ, ఆ వీడియోలో ఏముందో మీరైనా కనిపెడతారో లేదో చూద్దాం. 


99 శాతం మంది ఫెయిల్


సోషల్ మీడియాలో వైరల్ గా మారే అనేక ఫొటోలు, వీడియో ఛాలెంజుల్లో గెలవాలంటే చాలా కష్టం. అందులో ప్రతి ఒక్కదాన్ని చాలా క్షణ్ణంగా పరిశీలించాలి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి 99 శాతం మంది మోసపోతున్నారు. 


అందులో కుక్క ఉందని కొందరు.. పిల్లి ఉందని మరికొందరు వాదిస్తున్నారు. అసలు ఆ వీడియో చివరి వరకు చూసిన తర్వాత అందులో ఏముందో తెలిసిపోతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మీరైనా పరిశీలించి చెప్పండి. 


ఆ వీడియోలో ఏముందంటే?


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ ఇంటి పైకప్పుపై ఓ జంతువు ఉండడం కనిపిస్తుంది. ఆ తర్వాత కెమెరా జూమ్‌ చేసి చూసినప్పుడు.. కుక్క తల కనిపిస్తుంది. అయితే అప్పుడు చూసిన సమయంలో అది కుక్క అని వీడియో చూసిన వారందరూ భావిస్తారు. 


అయితే అది కుక్క కాదు. మొబైల్ జూమ్ చేసి చూసిన వెంటనే పిల్లి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటి వరకు అది కుక్క అని బలంగా నమ్మిన వాళ్లు పప్పులో కాలేసినట్లు అయ్యింది. నిజం తెలుసుకున్నాక ఆ వీడియో చూసిన వారంతా నవ్వుకుంటారు. 



ఆ పిల్లి వెనుక భాగం కుక్క ముఖం మాదిరిగా ఉండడం వల్ల అది శునకం అని చాలా మంది పొరబడ్డారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 61,474 వ్యూస్ లభించాయి. 


Also Read: Old Currency Buyers: ఈ కరెన్సీ నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొనే మీరు లక్షధికారి కావ్వొచ్చు


Also Read: Viral Food Video: వామ్మో!! కిలో స్వీట్ ధర రూ. 16 వేలా? ఈ మిఠాయికి అంత క్రేజ్ ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.