Viral Food Video: వామ్మో!! కిలో స్వీట్ ధర రూ. 16 వేలా? ఈ మిఠాయికి అంత క్రేజ్ ఎందుకో తెలుసా?

Gold Foil Sweets in Delhi: స్వీట్స్ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఢిల్లీలోని ఓ మిఠాయి షాపులో కిలో స్వీట్స్ ను రూ.16 వేలకు అమ్ముతున్నారట. అయితే అది బంగారు పూతతో తయారు చేసిందని ఆ వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఆ స్వీట్ ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? అనే విశేషాలను తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 06:58 AM IST
Viral Food Video: వామ్మో!! కిలో స్వీట్ ధర రూ. 16 వేలా? ఈ మిఠాయికి అంత క్రేజ్ ఎందుకో తెలుసా?

Gold Foil Sweets in Delhi: స్వీట్లంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? ఒకవేళ ఉన్నా చాలా తక్కువ మంది ఉంటారు. ఏ మంచి పని చేసిన తర్వాత నోరు తీపి చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. ఆ విధంగా మన దేశంలో ఏ శుభకార్యమైనా.. పండుగలకైనా మిఠాయిలు (స్వీట్స్) లేనిదే పని జరగదు. అలాంటి స్వీట్స్ ఎంతో ప్రేమతో భుజించే వారి కోసం మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు ఊరిస్తూ ఉంటాయి.  

అలాంటి వారికి ఈ వార్త కొంచెం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. గతంలో వెండి పూతతో తయారు చేసిన స్వీట్స్ ను కొందరు రుచి చూసే ఉంటారు. కానీ, ఈ సారి ఏకంగా బంగారు పూతతో ఉన్న స్వీట్స్ అందుబాటులోకి వచ్చాయి. 

కాకపోతే దాని ధర తెలిస్తే స్వీట్స్ ప్రేమికులు కూడా షాక్ అయ్యే రేంజ్ లో ఉంది. బంగారు పూతతో తయారు చేసిన స్వీట్స్ కిలో వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇంతకీ ఆ స్వీట్ ఏంటి? బంగారు పూతతో స్వీట్స్ ఎలా తయారు చేస్తున్నారు? ఆ స్వీట్స్ ధర ఎంతో తెలుసుకుందాం?

ఎక్కడంటే?

దేశ రాజధాని ఢిల్లీలోని మౌజ్‌పూర్ లో ఉన్న షాగూన్ స్వీట్స్ షాపులో ఈ బంగారు స్వీట్స్ ను అమ్ముతున్నారు. ఒక నిర్దిష్టమైన మిఠాయిపై బంగారు పూత పూసిన తర్వాత దానిపై కొంచెం కుంకుమ పువ్వును ఉంచి అందంగా అలంకరిస్తున్నారు. 

ఫుడ్ బ్లాగర్ అర్జున్ చౌహన్ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేశారు. నోరూరించే ఈ మిఠాయిని ఇంటిల్లిపాదితో కలిసి తినాలంటే చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ మిఠాయి కేజీ ధర అక్షరలా రూ.16,000. ఇంత ధర ఉన్నా దీన్ని రుచి చూడటానికి జనం ఎగబడుతున్నారు. 

ఈ బంగారు పూత కలిగిన స్వీట్స్ తయారు చేసే వీడియో ఇప్పుడు ఇన్‏స్టాగ్రామ్ లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 6 లక్షల 22 వేలకు పైగా లైక్స్.. వందల కామెంట్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 

Also Read:Whatsapp New Features: వాట్సప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీస్తే మూడు టిక్కులు గమనించారా?

Also Read: ఈ ఫొటోలలో ఉన్న సొట్టబుగ్గల సుందరిని మీరు గుర్తుపట్టారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News