Old Currency Buyers: ఈ కరెన్సీ నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొనే మీరు లక్షధికారి కావ్వొచ్చు

Old Currency Buyers: ఇంట్లో కూర్చొనే సంపాదించాలనుకునే వారి కోసం ఓ సువర్ణావకాశం గురించి చెప్పబోతున్నాం. దీని ద్వారా కేవలం లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే దీని కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి కదలకుండా ఆర్జన చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 07:55 AM IST
Old Currency Buyers: ఈ కరెన్సీ నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొనే మీరు లక్షధికారి కావ్వొచ్చు

Old Currency Buyers: పాత నోట్లు, నాణేల బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను మీరు ఎక్కడో ఒకసారైనా చదివే ఉంటారు. వీటిని ఎవరు కొంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వింటేజ్ (పురాతన) వస్తువులను సేకరించే అలవాటు ఉన్నవాళ్లలో ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. పురాతన వస్తువు ఏది కనిపించినా.. ఎంత డబ్బు ఇచ్చైనా సొంతం చేసుకునేందుకు కొందరు ముందుకొస్తుంటారు. 

ప్రపంచంలో ఇలాంటి కోవకు చెందిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు పురాతన వస్తువులను సేకరించడం హాబీగా (అలవాటు) పెట్టుకుంటారు. ఆ విధంగానే పాత నోట్లు (కరెన్సీ) కొనే వారు కూడా ఉన్నారు. కేవలం ఒక్క కరెన్సీ నోటుకు లక్షల్లో డబ్బును చెల్లిస్తారు. అలా మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటి ద్వారా లక్షాధికారి అవ్వొచ్చు. 

పాత 1 రూపాయి నోటుకు రూ.లక్ష

మీ దగ్గర పాత రూపాయి నోటు ఉంటే అందులో దాన్ని విక్రయించి రూ.లక్ష సంపాదించే అవకాశం ఉంది. ఉదాహరణకు.. ఆ నోటు పై 1957 సంవత్సరంలో ముద్రించబడినది అయ్యిండి.. అప్పటి హెచ్ ఎం పటేల్ సంతకం కచ్చితంగా ఉండాలి. అలాగే నోటు సీరియల్ నంబర్ 123456గా ఉండాలి. అలాంటి నోటు మీ దగ్గర ఉండి ఉంటే దాన్ని కాయిన్ బజార్ వెబ్ సైట్ లో మీరు విక్రయించవచ్చు. దీని ద్వారా రూ.1 లక్ష పొందే అవకాశం ఉంది. 

రూ.5 నోటు అమూల్యం

మీ దగ్గర పాత 5 రూపాయల నోటు ఉంటే ఇంట్లో కూర్చొనే దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అయితే ఈ 5 రూపాయల నోటు వెనుక ట్రాక్టర్ తో పాటు 786 నంబరు కావాలి. ఈ నోటును ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా మీరు రూ. 1 లక్ష వరకు సంపాదించవచ్చు.

రూ.10 నోటుకు రూ.25 వేలు..

మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉంటే, దాని నుండి మీకు అదనపు డబ్బు ఆర్జించవచ్చు. ఈ నోట్ ప్రత్యేకంగా భారతీయ CD దేశ్‌ముఖ్ సంతకాన్ని కలిగి ఉండాలి. అలాగే ఈ నోటుకు ఒకవైపు అశోక స్థంభం, మరోవైపు పడవను కలిగి ఉండాలి. ఈ నోటు వెనుక రెండు వైపులా 10 రూపాయలు ఇంగ్లీషులో రాయాలి. ఈ నోటు ద్వారా మీరు 20 నుంచి 25 వేల రూపాయలు సంపాదించవచ్చు.

ఈ పాత కరెన్సీని ఎలా విక్రయించాలి

1) పైన చెప్పిన విధంగా మీ దగ్గర ఏ కరెన్సీ నోటులో ఏవైనా ఉంటే.. మీరు దాన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ Quikrలో విక్రయించవచ్చు. 

2) ఈ వెబ్‌సైట్‌ ద్వారా పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు. 

3) పాత నోట్లను విక్రయించే ముందు ఆ Quikr వెబ్ సైట్ లో ఓ విక్రేతగా నమోదు చేసుకోవాలి. 

4) దాని తర్వాత మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్ ఫొటోలను అప్ లోడ్ చేయాలి. 

5) మీ మొబైల్ నంబరు సహా ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. 

6) మీరు అందించిన సమాచారాన్ని వెబ్ సైడ్ ధ్రువీకరించిన తర్వాత.. ఆ పాత కరెన్సీ నోట్ ను కొనాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. 

Also Read: Viral Food Video: వామ్మో!! కిలో స్వీట్ ధర రూ. 16 వేలా? ఈ మిఠాయికి అంత క్రేజ్ ఎందుకో తెలుసా?

Also Read: Whatsapp New Features: వాట్సప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీస్తే మూడు టిక్కులు గమనించారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News