సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యం కల్గిస్తుంటే..ఇంకొన్ని ఆసక్తి రేపుతుంటాయి. జంతువుల వీడియోలైతే ఇంకా. ఈ వీడియో అలాంటిదే..ముందు నుయ్యి..వెనుక గొయ్యి చందంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడవిలో సింహాన్ని ఎదుర్కోవడం గానీ, సింహంతో ఆటలాడే ధైర్యం గానీ మరే ఇతర జంతువుకు ఉండదు. సింహం బలం, పరాక్రమం కారణంగా అడవికి రాజైంది. సింహం ఏదైనా జంతువును టార్గెట్ చేసిందంటే..ఇక ఆ జంతువు తప్పించుకోవడం అసాధ్యం. వైల్డ్ యానిమల్స్‌కు చెందిన వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ వీడియోలో ఓ గేదెను వెంటాడుతున్న సింహం కన్పిస్తుంది. 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో..అడవిలో ఓ సింహం ఎలా గేదె వెంటపడుతుందో స్పష్టంగా చూడవచ్చు. ఆ గేదె తన ప్రాణం కాపాడుకునేందుకు పరుగెత్తుతూ..పరుగెత్తుతూ ఓ నదిలో దూకి..ఆ నది దాటేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ నదిలో అప్పటికే ఓ మొసలి వేట కోసం ఎదురుచూస్తుంటుంది. నదిలో ప్రవేశించిన గేదెను చూసిన వెంటనే..మొసలి దానిపై ఎటాక్ చేస్తుంది. వెనుకన సింహం..చోద్యం చూస్తుంటుంది.



ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో షేర్ అయిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. పెద్దఎత్తున కామెంట్లు, లైక్స్ వస్తున్నాయి. సింహం నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నదిలో దూకిన గేదెను ముసలి పట్టుకోవడం..గేదె నిస్సహాయతకు అద్దం పడుతోంది. 


Also read: King Cobra Viral Video: స్నేక్ క్యాచర్స్ ను ఓ పట్టు పట్టిన 10 అడుగుల 9 కేజీల నల్ల కింగ్ కోబ్రా .. చివరికి ఏం జరిగిందో ఈ వీడియో చూడండి ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook