Angarak Yoga 2024: కుజుడు మార్చి 15వ తేదీన కుంభ రాశిలోకి సంచారం చేశాడు ఆ తర్వాత ఈ గ్రహం ఏప్రిల్ 23న మీన రాశిలోకి ప్రవేశించబోతోంది ఇలా శని రాశి అయిన కుంభ రాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేయడం కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఇప్పటికే రాహు గ్రహం కూడా సంచార దశలో ఉంది దీనికి కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని, దీనికి కారణంగా వారు అదృష్టాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సమయంలో ఈ రెండు గ్రహాలు వ్యక్తిగత జాతకాల్లో ప్రతికూల స్థానాల్లో ఉంటే ఈ సమయంలో అనేక సమస్యలు మొదలవుతాయని వారంటున్నారు.. అలాగే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఒక ప్రత్యేకమైన అంగారక యోగం ఏర్పడబోతోంది. ఈ అంగారక యోగం ఏప్రిల్ నెల మొత్తం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది అంతేకాకుండా ఈ సమయంలో ఏవైనా శుభకార్యాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం నిషిద్ధం. అంతేకాకుండా ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీడు యోగంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.


మేష రాశి:
అంగారక యోగం కారణంగా మేష రాశి వారికి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న పనులు ఆగిపోవచ్చు అలాగే డబ్బులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడం ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. అలాగే లావాదేవీలు చేసేవారు ఈ సమయంలో పరిమితంగా చేయడం ఎంతో మంచిది లేకపోతే మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.


కన్యా రాశి:
అంగారక యోగం కారణంగా కన్యారాశి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి కోపం రెట్టింపవ్వడం కారణంగా అనేక రకాల సమస్యల బారిన పడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు కోపం కారణంగా కొన్ని ఇబ్బందులకు కూడా గురవుతారు. కాబట్టి మాటలను నియంత్రించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ సమయంలో వీరు పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


కుంభరాశి:
కుంభ రాశి వారికి అంగారక యోగం కారణంగా అనేక రకాల ఇబ్బందుల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ సమయంలో కోపం కారణంగా అనేక సమస్యల బారిన పడతారు. కాబట్టి మాటలను నియంత్రించుకోవడం ఎంతో మంచిది ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలకు గురవుతున్న వారు తప్పకుండా ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి