Astrology: మరికొన్ని గంటల్లో కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..
Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యుక్షుడలైన కుజుడు మరికొన్ని గంటల్లో ఫిబ్రవరి 5న ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన కుజుడు ఫిబ్రవరి రాత్రి 9.56 నిమిషానికి మకరరాశిలో ప్రవేశించనున్నాడు. పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 5, 2024న, కుజుడు మకరంలో ప్రవేశించనున్నాడు. మరియు మార్చి 15, 2024 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులను తీవ్ర ప్రభావితం చేయనున్నాయి. శని రాశి అయిన మకరంలో కుజుడు సంచరించడం వల్ల ఈ రాశుల వారికీ మంచి ఫలితాలు కలగనున్నాయి.
మార్చి 15 వరకు కుజుడు తానున్న రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరరాశిలో కుజుడు ఉండటం వల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి, శని రాశిలో అంగారకుడి సంచారంతో ఏ రాశుల వారికి మంచి రోజులు మొదలు కానున్నాయో ఓ లుక్కేద్దాం..
మేష రాశి:
అంగారకుడు రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి అద్భుత యోగం అనే చెప్పాలి. ఈ రాశుల వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే టైమ్‌లో విదేశీ పర్యటన యోగం ఉంది. మీ అదృష్టం మీకు అనుకూల ఫలితాలను అందిస్తోంది.
వృషభం:
వృషభ రాశి వారికీ ఈ గ్రహ సంచారం శుభప్రదంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికీ సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అదే టైమ్‌లో కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు ఉద్యోగంలో పదొన్నతి పొందే అవకాశాలున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికీ ఇది శుభ ఫలితాలను అందించే కాలం. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అంతేకాదు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అదే సమయంలో ఆర్ధికంగా లాభం. ఇష్టపూర్వకమైన ఖర్చులు పెరుగుతాయి. దైవ దర్శనం చేసుకోవడాన్ని మర్చిపోవద్దు.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Lemon in Auction: వేలంలో రూ.1.5 లక్షలు పలికిన నిమ్మకాయ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook