Astrology: పదేళ్ల తర్వాత కుంభరాశిలో రవి, శుక్రుల అద్భుత కలయిక.. ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..
Astrology: అనంత విశ్వంలో గ్రహాలు నిరంతరం పరిభ్రమిస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక దశాబ్ద కాలంలో శుక్రుడు, రవి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నారు. దీంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతున్నట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు.
Astrology - Surya - Shukra Yuthi: గ్రహాల రాజు.. సూర్యుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చకోబోతున్నాయి. శుక్రుడు ప్రేమ, వివాహాం, ఆకర్షణకు కారక గ్రహంగా పరిగణించబడుతోంది. శుక్రుడు మంచి స్థానంలో ఆర్ధిక లాభాలను తీసుకొస్తోంది. సూర్యుడు శుభ స్థానంలో ఉన్నపుడు ఆ వ్యక్తి యెక్క కీర్తి పెరుగుతోంది. ప్రస్తుతం సూర్యుడు మరకంలో ఉన్నాడు. ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.
అదే సమయంలో మార్చి 7న శుక్రుడు మకరం నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక మార్చి 7 నుంచి 15 వరకు వారం రోజుల్లో రవి, శుక్రుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తాయి. దాదాపు 10 యేళ్ల తర్వాత కుంభంలో రవి, శుక్ర కలయికల వల్ల ఏ రాశుల వారికీ ప్రయోజనం జరగబోతుందో చూద్దాం..
తులా రాశి :
శుక్రుడు, రవి కలయిక వల్ల తులా రాశి వారికి అంతా శుభమే ఉంటుంది. వీళ్ల కెరీర్లో అనేక అవకాశాలు పొందుతారు.
అంతేకాదు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఆర్ధిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు అదృష్టం కలిసొస్తోంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి రవి, శుక్ర యుతి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలు అవుతాయి. జీవితంలో కొత్త మార్పులు ఉంటాయి. మీరు కుటుంబం మరియు భార్య లేదా భర్తతో మంచి సమయాన్ని గడుపుతారు. ఎక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ కూడా వేసుకోవచ్చు.
మకర రాశి:
శుక్రుడు, సూర్యుడు కలయిక మకరరాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆర్ధికంగా బలోపేతమవుతారు. జీవితంలో కష్టాలు దూరమవుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్ధతు లభిస్తోంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. వ్యాపారస్తులకు అంతా శుభమే కొన్ని శుభవార్తలు వింటారు.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook