Astrology for Car, Do Not Keep These Things in Your Car: ప్రస్తుత రోజుల్లో కూడా చాలా మంది వ్యక్తులు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే ముఖ్యమైన లేదా పెద్ద పనులను చేస్తారు. మీకు కూడా జ్యోతిష్యంపై నమ్మకం ఉండి.. కారు యజమాని అయితే ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ వాహనంలో దుమ్ము, ధూళి ఉండడం వల్ల లేదా వాహనంలో చాలాకాలం పాటు చెత్తను అలానే ఉంచడం వల్ల రాహువు ఆగ్రహానికి గురవుతాడు. అందుకే వాహనాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను కారులో అస్సలు ఉంచరాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ వాహనం తరచుగా చెడిపోవడం కూడా జ్యోతిష్య సంకేతంగా భావించండి. ఇలా జరిగితే.. ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాహువు దుష్ట స్థితిని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తికి ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం కారులో ఏ ఏ వస్తువులు ఉంచరాదో ఇప్పుడు తెలుసుకుందాం. 


ట్రంక్‌లో అనవసర వస్తువులు పెట్టరాదు:
చాలా మంది వ్యక్తులు కారు ట్రంక్‌లో అనవసరమైన వస్తువులను ఎప్పుడూ ఉంచుతారు. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నిత్యం అనవసరమైన వాటిని ట్రంక్‌లో ఉంచడం అశుభం. ఇలా చేస్తే శని దేవుడికి కోపం వస్తుంది. ఇది ఏ వ్యక్తికి మంచిది కాదు. అందుకే కారు ట్రంక్‌లో వ్యర్థాలు, పాత బిల్లులు, అనవసరమైన కాగితాలు, పాడైన బాటిళ్లు వంటివి ఉంచవద్దు. 


కారు శుభ్రంగా ఉంచండి:
లక్ష్మిదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మిదేవి మురికిని ఎప్పుడూ ఇష్టపడదు. అపరిశుభ్రం ఉన్నచోట లక్ష్మిదేవి అస్సలు ఉండదు. అందుకే కారును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది. లేకుంటే ఎంత డబ్బు సంపాదించినా అంతకు మించి ఖర్చు అవుతుంది.


Also Read: Jupiter Rise 2023: 2023లో బృహస్పతి ఉదయం.. ఈ 4 రాశుల వారికి పండగేపండగ! డబ్బు వర్షం పక్కా  


Also Read: Hair Care Tips: బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే.. దీపికా పదుకొనె లాగా మెరిసే జుట్టు మీ సొంతం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.