Jupiter Rise 2023: 2023లో బృహస్పతి ఉదయం.. ఈ 4 రాశుల వారికి పండగేపండగ! డబ్బు వర్షం పక్కా

Cancer, Gemini, Aquarius and Pisces Zodiac Signs will get unexpected money after Jupiter Rise 2023. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో గురుడు ఉదయించబోతున్నాడు. దీనివల్ల ఈ నాలుగు రాశుల వారు లాభపడనున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 6, 2023, 03:01 PM IST
  • 2023లో బృహస్పతి ఉదయం
  • ఈ 4 రాశుల వారికి పండగేపండగ
  • డబ్బు వర్షం పక్కా
Jupiter Rise 2023: 2023లో బృహస్పతి ఉదయం.. ఈ 4 రాశుల వారికి పండగేపండగ! డబ్బు వర్షం పక్కా

These 4 Zodiac Sign peoples will get unexpected money after Jupiter Rise 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహానికి ఒకటి లేదా రెండు రాశులతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఒక గ్రహం ఉదయించినప్పుడు లేదా అస్తమించినప్పుడు.. ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఆ ప్రభావం కొన్ని రాశుల వారికి మేలు చేస్తే.. మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. సంపద, ఆస్తి, విద్య, పిల్లలు, జీవిత భాగస్వామి మరియు ఉన్నత స్థానానికి కారకంగా దేవగురు బృహస్పతి పరిగణించబడింది. ఓ వ్యక్తి జాతకంలో బృహస్పతి గ్రహం బలమైన స్థానంలో ఉంటే.. శుభ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో గురుడు ఉదయించబోతున్నాడు. దీనివల్ల ఈ నాలుగు రాశుల వారు లాభపడనున్నారు. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి గురువు ఉత్కృష్టతతో అదృష్టం మెరుస్తుంది. ఈ అదృష్టం వల్ల కర్కాటక రాశి వారు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సరదాగా ఉంటారు. 

మిథున రాశి: 
మిథున రాశి వారికి బృహస్పతి ఉదయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కెరీర్ పరంగా ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అధిక లాభాలు ఉంటాయి. 

కుంభ రాశి:
బృహస్పతి ఉదయించడం వల్ల కుంభ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. గతంలో నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ముఖ్యంగా విద్య, మీడియా రంగాలకు సంబంధించిన వ్యక్తులు చాలా ప్రయోజనం పొందుతారు. డబ్బు వర్షం కురుస్తుంది. 

మీన రాశి: 
మీన రాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల ఊహించని లాభాలు ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి డబ్బు సహాయపడుతుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు.

Also Read: Best Mircro SUV Cars: టాటా పంచ్ కంటే ఈ మైక్రో ఎస్​యూవీ కార్ అదుర్స్.. 6 మంది కూర్చోవచ్చు! ధర 6.18 లక్షలు మాత్రమే

Also Read: Ducati Bikes in India: డుకాటీ బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లోకి 9 మోటార్‌సైకిళ్లు! ధర 10 లక్షల నుంచి మొదలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News