Astrology: సూర్య దేవుడి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికీ చాలా గౌరవం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడి అనుగ్రహంతో ఒక వ్యక్తి గౌరవాన్ని సంపదను పొందుతాడు. సూర్య భగవానుడి రాశి మార్పు వల్ల ఈ రాశుల వారికి జాక్ పాట్ తగలనుంది. మే 13 వరకు సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఏ రాశుల వారికీ అనుకూలంగా ఉందో మీరు ఓ లుక్కేయండి...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..


అనుకోని ధనలాభంతో ఆర్ధికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంఓ లాభసాటి అవకాశాలుంటాయి. వ్యాపారంలో అనుకోని లాభాలు ఆర్జిస్తారు. తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ధైర్యం వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలుగుతాయి. చేసే పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పర్సనల్ లైఫ్‌లో సంతోషాన్ని ఆస్వాదిస్తారు.


మిథున రాశి..
సూర్యుడి మీన రాశి సంచారం వల్ల మిథున రాశి వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగం మారాలనుకునేవారికీ ఇదే అత్యంత అనువైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటంబ సభ్యులతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు.
నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం. విద్యారంగంలోని వారికి అత్యంత అనుకూలమైన సమయం. ఏదైనా లావాదేవిలకు చేయాలనుకునే వారికీ ఇంత కంటే మంచి సమయం ఏది ఉండదు.


సింహ రాశి..
మే 13 వరకు మీనరాశిలో రవి సంచారం వల్ల ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలిగిపోతాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. డబ్బు ఇతర సంబంధింత అంశాల్లో అనకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠతలు పెరుగుతాయి. పెట్టుబడి మూలక ధన లాభం ఉంటుంది.


కన్యరాశి..
రవి మీన రాశిలో సంచారం వలన కన్య రాశి వారికీ ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు చేస్తోన్న పనుల్లో గౌరవం పెరుగుతోంది. ఆఫీసులో మీ మాటకు ఎదురుండదు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న  పనులు పూర్తి చేస్తారు. ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: Lok Sabha Polls 2024: రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర.. కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook