Budh Mahadasha: ఆస్ట్రాలజీ ప్రకారం, మనిషి జీవితంపై గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహాలు వ్యక్తుల యెుక్క జాతకాల్లో శుభ మరియు అశుభ స్థానాల్లో ఉంటాయి. ఈ గ్రహాల స్థితి కొందరికి లాభాలను ఇస్తే...మరికొందరికి నష్టాలను మిగులుస్తాయి. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడి అని పిలుస్తారు. మేధస్సు. తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. సాధారణంగా బుధగ్రహం యెుక్క మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. వ్యక్తి జాతకంలో బుధుడు అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి శారీరంగా మరియు మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అంతేకాకుండా అతడు లెక్కల్లో వీక్ గా ఉంటాడు. బుధ మహాదశ ప్రభావం, పరిహారం గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ మహాదశ ప్రభావం
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి బుధ గ్రహం యొక్క మహాదశను ఎదుర్కోవలసి ఉంటుంది. జాతకంలో బుధుడు ప్రతికూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అంతేకాకుండా అతడికి ముక్కు, చెవి, చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా ఉండవచ్చు. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీరు ఏ పని మెుదలుపెట్టినా అందులో అడ్డంకులు ఎదురవుతాయి.


జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే...
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం జాతకంలో బలంగా ఉంటే... ఆ వ్యక్తి మంచి మాటకారి అని అర్థం. అంతేకాకుండా అతడు మ్యాథ్స్ సబ్జెక్టులో దిట్ట కూడా. బిజినెస్ లో మంచి డబ్బు సంపాదిస్తాడు. అతడు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తాడు.  


బుధ పరిహారాలు..
జాతకంలో బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి మెర్క్యూరీ యొక్క'ఓం బ్రాం బ్రిం బ్రౌన్ సహ బుధాయ నమః!' అనే బీజ మంత్రాన్ని రోజూ జపమాలతో పఠించాలి.  అలాగే బుధ గ్రహానికి సంబంధించిన పచ్చి మూంగ్ పప్పు, ఏదైనా పచ్చి కూరగాయ, ఏదైనా ఆకుపచ్చ వస్త్రం వంటి దానాలను బుధవారం నాడు చేయాలి.


Also Read: Shani Margi 2022: శివరాత్రి నాడు శని గమనంలో మార్పు... వీరందరికీ శుభఫలితాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook