Shani Margi Effect on Zodiac Signs : ఈ ఏడాది శనిదేవుడు తన రాశిచక్ర స్థానాన్ని మారుస్తూనే ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబరు 23న మరోసారి శనిగమనంలో మార్పు రాబోతుంది. ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్న శని ప్రత్యక్ష సంచారంలోకి (Shani Margi 2022) రాబోతున్నాడు. ఇదే రోజు ధంతేరాస్, నెలవారీ శివరాత్రి కూడా రావడం విశేషం. ఇలాంటి యాదృచ్ఛికం రావడం చాలా అరుదు. ఈ సమయంలో శని యెుక్క ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది.
పంచాంగం ప్రకారం, అక్టోబరు 23 నుండి శని నేరుగా కదలడం ప్రారంభిస్తాడు. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. నెలవారీ శివరాత్రి రోజున శని దిక్కుగా ఉండటం చాలా శుభప్రదం. ఎందుకంటే మాస శివరాత్రి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శివుడికి ఇష్టమైన ఈ రోజున శని సంచారం ఉండటం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా శని యెుక్క ఈ ప్రత్యక్ష కదలిక వల్ల కొన్ని రాశులవారు సడేసతి మరియు ధైయా నుండి బయటపడతారు.
సాధారణంగా శనిదేవుడిని పాపగ్రహంగా పరగణిస్తారు. శనిదేవుడు ఎప్పుడు చెడు ఫలాలే ఇస్తాడని ప్రజలు నమ్ముతారు. కాని శని ఎప్పుడు కర్మానుసారమే ఫలాలను ఇస్తాడు. అందుకే శనిదేవుడిని కర్మదాత, న్యాయదేవత అని పిలుస్తారు. ఎవరు చెడుపనులు చేస్తారో, ఏ వ్యక్తి జాతకంలో శని అశుభస్థానంలో ఉంటాడో వారికి శనిదేవుడు సమస్యలు సృష్టిస్తాడు. మంచి పనులు చేసేవారికి, కష్టపడే వారికి, నిస్సహాయులకు సహాయం చేసేవారికి శనిదేవుడు శుభఫలితాలను ఇస్తాడు. మరోవైపు శని మహాదశ, సాడే సతి మరియు ధైయాతో బాధపడుతున్నవారు ఇలాంటి సమయంలో కూడా తప్పుడు పనులు చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తాడు.
Also Read: Venus Transit 2022: శుక్రుడు 'మాలవ్య యోగం'.. ఈ 5 రాశులకు శుభప్రదం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook