Chandra Grah Gochar 2023: రీసెంట్ గా చంద్రగ్రహణం కనిపించింది. నేటి నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో అవసరమైన వారికి ఆహారం పెట్టడం వల్ల దేవతలు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తారు. చంద్రగ్రహణం తర్వాత చంద్రుడు నాలుగు రాశుల గుండా ప్రయాణించనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వారం ప్రారంభంలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అంటే 08వ తేదీ 08:20 గంటలకు ధనస్సు రాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. అనంతరం మే 10వ తేదీ రాత్రి 11.24 గంటలకు మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మే 12 తేదీ 01:45కి చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. వచ్చే వారంలో సూర్యుడు మరియు కుజుడు గమనంలో కూడా పెను మార్పు రానుంది. చంద్రుని సంచారం వల్ల ఏయే రాశులు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం. 


1. మేషం
మేష రాశి వారికి చంద్ర సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఈ రాశి వారు మే 08న జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వచ్చే మంగళవారం ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ అదృష్ట దినం గురువారం.
2. మిథునం
చంద్ర సంచారం మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో బంధం బలపడుతుంది. ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు రాహువు శాంతి కోసం చర్యలు తీసుకోవడం మంచిది. మీ అదృష్ట దినం బుధవారం.   
3. కర్కాటకం
చంద్రుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ వారం నల్ల కుక్కకు బ్రెడ్ తినిపించడం మంచిది. మీ అదృష్ట దినం సోమవారం.
4. తులారాశి
తుల రాశి వారికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీకు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ అదృష్ట దినం శుక్రవారం. 
5. మీనం
మీన రాశి వారికి ఈ సమయం చాలా మంచిది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ వారం మీరు శివుని పంచాక్షరీ స్తోత్రాన్ని పఠించాలి. మీ అదృష్ట దినం మంగళవారం.


Also Read: Mangal Gochar 2023: మరో 4 రోజుల్లో ఈ రాశులకు గోల్డెన్ డేస్ రాబోతున్నాయి.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook