Chandra Grahan 2022: చంద్ర గ్రహణం కారణంగా రాజకీయ నాయకులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. లేక పోతే అంతే సంగతి..!
Chandra Grahan 2022 Time: చంద్ర గ్రహణం కారణంగా మహిళలు, గర్భిణీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణం కారణంగా చాలా రకాల అశుభాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan 2022 Time: సూర్యుడి నీడ భూమి, చంద్రుడు గుండా వెళ్ళే క్రమంలో సమలేఖనం జరిగినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రుడు సంపూర్ణంగా కనిపించడం అగిపోతుంది. అయితే ఇదే ప్రక్రియ నవంబర్ 8 వ తేదిన జరగబోతోంది. దీనినే సంపూర్ణ చంద్ర గ్రహణం అంటారు. ఈ చంద్ర గ్రహణం 2022 మాత్రమే కాకుండా 2025లో కూడా ఏర్పడబోతోందని ఖగోళ శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో పలు రాష్ట్రాల్లో పక్షికంగా ఏర్పడినప్పటికీ కోల్‌కతా, భువనేశ్వర్, పాట్నా, గౌహతి, కొహిమా, ఐజ్వాల్ ఇతర రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఏర్పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
చంద్ర గ్రహణం 2022 తేదీ, సమయాలు:
నవంబర్ 8 (మంగళవారం)
సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది.
ముగిసే సమయాలు: సాయంత్రం 6.19
జ్యోతిష్య అంచనాలు:
ఈ పరిణామాలు తప్పవు:
- సముద్రంలో అలజడి రేగే అవకాశాలున్నాయి.
- కరువు సమస్యలు, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
- ప్రముఖ రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి.
- పంటలు దెబ్బతింటాయి.
- దొంగతనం, దోపిడీ, కిడ్నాప్‌లు జరిగే అవకాశాలున్నాయి.
- బంగారం ధరలు పెరుగుతాయి.
- నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.
- చిత్రకారులు, రచయితలకు తీవ్ర నష్టాలు.
గ్రహణం క్రమంలో చేయవలసినవి, చేయకూడని పనులు:
- సూతకాలం మొదలైనప్పటి నుంచి స్నానాలు చేయకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
- దానధర్మాలు చేయడం, జపం చేయడం, మంత్ర-సిద్ధి, ధ్యానం మొదలైన పనులు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
- సూతక్ కాలంలో విగ్రహాలను తాకకూడదు, అనవసరంగా తినకూడదు లేదా త్రాగకూడదు. ముఖ్యంగా శృంగారంలో పాల్గొన కూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
- అబద్ధాలు లేదా మోసపూరిత చర్యలకు దూరంగా ఉండాలి.
- సూతక్ కాలంలో పిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి