Devshayani Ekadashi 2022: ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే దేవశయని ఏకాదశి అంటారు. ఈ సారి దేవశయని ఏకదాశి జూలై 10న (Devshayani Ekadashi July 2022) వచ్చింది.  ఈ తేదీ నుంచి నారాయణుడు నాలుగు నెలలపాటు నిద్రలో ఉంటాడు. అందువల్ల ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు. ఒకవేళ ఏ శుభకార్యమైనా చేసినా దాని ఫలితం దక్కదని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవశయని ఏకాదశి నుండి.. వివాహం, గృహ ప్రవేశం మొదలైన అన్ని శుభకార్యాలు రాబోయే నాలుగు నెలల పాటు నిలిపివేయబడతాయి. అంతేకాకుండా ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. సాధువులు, సన్యాసులు  ఒకే స్థలంలో ఉంటూ తపస్సు, ధ్యానం, స్వీయ అధ్యయనం మరియు ఉపన్యాసాలు చేస్తారు. 


దేవశయని ఏకాదశి తేదీ 
ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జూలై 9, శనివారం సాయంత్రం 4:40 గంటలకు ప్రారంభమై... జూలై 10 ఆదివారం మధ్యాహ్నం 2:14 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆధారంగా దేవశయని ఏకాదశి వ్రతం జూలై 10న చేస్తారు.


దేవశయని ఏకాదశి రోజున రవియోగం, శుభ యోగం, శుక్ల యోగం ఏర్పడుతున్నాయి. శుభ యోగం ఉదయం నుండి అర్ధరాత్రి 12:45 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుక్ల యోగం మెుదలవుతుంది. దేవశయని ఏకాదశి రోజున ఉదయం 05:31 నుండి రవియోగం ప్రారంభమై ఉదయం 09:55 వరకు ఉంటుంది. 


(Note; ఇక్కడ అందించిన సమాచారం ఊహలు మరియు సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటుంది. ZEE Telugu News.com నిర్ధారించలేదు)


Also Read:Budhaditya Yoga: మిథునరాశిలో బుధాదిత్య యోగం... ఈ 5 రాశులవారి భవిష్యత్తు అమోఘం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook