Budhaditya Yoga Effect: జూలైలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. నిన్న బుధుడు తన రాశిని మార్చి... మిథునరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే సూర్యుడు అదే రాశిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధుడు-సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య యోగం (Budhaditya Yoga) ఏర్పడింది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో బుధాదిత్య యోగం శుభప్రదమైనదిగా భావిస్తారు. మిథునరాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం ఎవరికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.
మిథునం (Gemini): మిథునరాశి వారికి బుధాదిత్య మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఈ రాశివారికి లక్ష్మిదేవి అనుగ్రహం వల్ల చాలా డబ్బు వస్తుంది. వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన ధనం అందుతుంది. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు.
కన్య (Virgo): బుధుడు-సూర్యుడు కలయిక కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
తుల (Libra): ఈ రాశివారికి ధనం లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ధార్మిక-ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. కొత్త ఉద్యోగం వస్తుంది.
ధనుస్సు (Sagittarius): బుధాదిత్య యోగం ధనుస్సు రాశి వారికి అపారమైన డబ్బును ఇస్తుంది. వ్యాపారవేత్తల పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. భాగస్వామితో బంధం బలపడుతుంది.
కుంభం (Aquarius): మిథునరాశిలో బుధుడు-సూర్యుడు కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం కుంభ రాశి వారికి అంతులేని సంపదను ఇస్తుంది. వీరు ఏ పనినైనా కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ప్రతిష్ట పెరుగుతుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలం.
Also Read: Palmistry: మీ అరచేతి వేళ్ల మధ్య గ్యాప్ అంత ఉంటే... దురదృష్టం మీ వెంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook