Religious Locket Astrology:  హిందూమతంలో భక్తి శ్రద్ధలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి దేవుడికి సంబంధించిన కొన్ని వస్తువులను మనం ధరిస్తాం. అందులో భాగమే మెడలో దేవుడి లాకెట్ ధరించడం. ఇలా కొందరు తమ మెడలో దేవుళ్లు లేదా దేవతల ఫోటో ఉన్న లాకెట్లు ధరించి కనిపిస్తారు. దేవుడి లాకెట్ ను కొందరు బంగారు గొలుసులు, మరికొందరు వెండి గొలుసులో వేసుకుని ధరిస్తారు. చాలా మంది తమ మతపరమైన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మెడలో తులసి, రుద్రాక్షలతో చేసిన చిహ్నాలు, దేవతల లాకెట్లు లేదా మాలలను ధరిస్తారు. 
 
ఇలా ధరించడం వల్ల దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు అందుతాయని దీని వెనుక నమ్మకం. అయితే, మతపరమైన దృక్కోణంలో అలా చేయడం తప్పు. ఎందుకంటే, మనం ప్రతిరోజు అనేక రకాల శుభ, అశుభ కార్యాలు చేస్తూ ఉంటాం. కేవలం లాకెట్ మాత్రమే కాకుండా భగవంతునితో అనుసంధానించబడిన దేనినీ మనం శరీరంపై ధరించకూడదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పురోగతికి అడ్డంకి..
మెడలో దేవుడి లాకెట్ ను ధరించడం వల్ల ఒకరి పురోగతికి అడ్డంకిగా మారుతుందని నమ్మకం. ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే, శాస్త్రాల ప్రకారం రుద్రాక్షను శరీరంపై ధరించవచ్చు. కానీ, ఇది కూడా కొన్ని నియమాలను తప్పకుండా అనుసరించి ధరించాలి. అయితే, లాకెట్ ధరించడం వల్ల అనేక రకాల హాని కలుగుతుంది. 


దేవత లాకెట్లను ఎందుకు ధరించకూడదో తెలుసా?
1. జోతిష్యం ప్రకారం మెడలో దేవతా లాకెట్ ధరించడం మన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే, మనం రోజంతా పవిత్రంగా ఉండలేం. చాలాసార్లు మన కుడి చేయి లాకెట్‌ను తాకుతూనే ఉంటుంది. ఇది మన పురోగతికి అడ్డంకిగా మారుతుందని గుర్తుంచుకోవాలి.  


Also Read: Love Horoscope today: ఈరోజు ఎవరి లవ్ సక్సెస్ అవుతుందో, ఎవరిది ఫట్ అవుతుందో తెలుసుకోండి..


2. ముఖ్యంగా వివాహితులు ప్రత్యేకించి దేవతా లాకెట్‌ను ధరించకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.


3. అంతేకాదు, లాకెట్ ధరించడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం కూడా గ్రహాల కదలికను ప్రభావితం చేస్తుంది. గ్రంథాల ప్రకారం అపరిశుభ్రమైన లాకెట్ ప్రతికూలతను ప్రసరింపజేస్తుంది. అటువంటి లాకెట్ ధరించడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి.


4. లాకెట్ ధరించడం ద్వారా రాహువు చెడు ప్రభావాలను ఎదుర్కోవచ్చు. ఇది వ్యక్తి ఒత్తిడిని పెంచుతుందని నమ్ముతారు. అందుకే మెడలో దేవతామూర్తుల లాకెట్ ధరించకూడదని జోతిష్యం చెబుతోంది.


Ram mandir Darshan Timings: రామమందిరం దర్శనం వేళలు ఇవే, సేవా టికెట్లు ఇలా బుక్ చేసుకోవాలి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook