Love Horoscope today: గ్రహాలు, నక్షత్రాల గమనం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇవి వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే మంచి ఫలితాలను, అశుభ స్థానంలో ఉంటే చెడు ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఏ రాశివారి జాతకంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా లవ్ మరియు వైవాహిక జీవితాన్ని రాశులు ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం.
మేషం: భార్యభర్తలిద్దరూ ఈ సమయంలో ఇష్టం లేని పనులు చేయడం వల్ల వాటిలో కొత్త అనుభవంతోపాటు మంచి అనుభూతిని పొందుతారు. మీ శృంగార జీవితం బాగుంటుంది. సింగిల్స్ లవ్ సక్సెస్ అవుతుంది. అది పెళ్లి కూడా దారి తీస్తుంది.
వృషభం : నక్షత్రాల కదలికలు వృషభరాశి వ్యక్తుల ప్రేమ జీవితాన్ని ప్రేరేపిస్తాయి. మీరు ఈ సమయంలో పిరికి ఉండకండి, ఏది చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పండి. మీరు ఇష్టపడే వ్యక్తి దగ్గర ఓపెన్‌గా ఉండండి, అది మీకు మేలు చేస్తుంది.
మిథునం: మీ లైఫ్ పార్టనర్ తో సన్నిహితంగా ఉండటం వల్ల మీ మధ్య బంధం ఇంకా బలపడుతుంది. మీ మనసు చెప్పిన మాట వినండి. మీరు ప్రేమించే వ్యక్తితో నిజాయతీగా వ్యవహారించండి. ఇలా చేయడం వల్ల మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం: ఈ సమయం ప్రేమికులకు పరీక్షా కాలం. వీరి మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ లవర్ తో కఠినంగా ఉండకండి. భావోద్వేగాలకు లోనవ్వకండి. ఏ విషయమైనా నిజాయతీగా చెప్పడానికి ప్రయత్నించండి.
సింహం: సింహరాశి వ్యక్తులకు సంబంధించిన ప్రేమ విఫలమవుతుంది. ఈరోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మీ లవ్ ను వ్యక్తపరచవద్దు. ఇవాళ మీరు ప్రేమించి వ్యక్తి దగ్గరకు వెళ్లినట్లయితే అది మీ మధ్య దూరానికి కారణం కావచ్చు. ఒక వేళ వెళ్లినా ఆచితూచి మాట్లాడండి.
Also Read: February 2024 Careful Zodiac: ఫిబ్రవరి నెలలో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే అంతే సంగతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter