Benefits of GajaKesari Yog 2024:  పంచాంగం ప్రకారం, ఇవాళ ఉదయం 10 గంటల నుండి 43 నిమిషాలకు చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దేవగురు బృహస్పతి ఇప్పటికే మేష రాశిలో కూర్చుని ఉన్నాడు. వీరిద్దరి కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం సంభవించబోతుంది. ఈ యోగం ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఉంటుంది. చంద్రుడు వృషభరాశిలోకి  ప్రవేశించగానే గజకేసరి రాజయోగం భంగమవుతుంది. ఇదే సమయంలో రవియోగం, శుభయోగం, అశ్వినీ నక్షత్రం కూడా ఏర్పడబోతుంది. గజకేసరి రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం: కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ అవుతుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. 


మేషం: చంద్రుడు మరియు బృహస్పతి చేస్తున్న గజకేసరి రాజయోగం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. 


మిథునం: గజకేసరి యోగం వల్ల మీ కెరీర్‌ అద్భుతంగా ఉండబోతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. మీకు లక్ కలిసి వస్తుంది. 


Also Read: Venus Transits 2024: ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్ ప్రారంభం కాబోతోంది..ఊహించని లాభాలే, లాభాలు!


Also Read: Rajyog in Feb 2024: మకరరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook