Ganesh Chaturthi 2022: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చవితిలో భాగంగా వినాయకుడికి భక్తుల భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు దేశ వ్యాప్తంగా పూజలు చేస్తారు. ప్రస్తుతం చాలా మంది భక్తులు ఉపవాసాలు కూడా చేస్తారు. 'భాద్రపద శుద్ధ చవితి'  రోజున గణేశుడు జన్మించినందున ఈ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అన్ని పండగలకు ఎదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రత్యేకతలే పండగలకు మంచి ప్రధాన్యతలను ఇస్టాయి. అయితే వినాయక చవితి పండగకు కూడా ఓ ప్రత్యేకత కలిగి ఉంది. చవితి రోజూన చందమామని చూడకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక వేళా రాత్రి పూట ఆ చందమామని చూస్తే అందరి చేత మాటలు పడాల్సి వస్తుందని భారతీయుల నమ్మం. ముఖ్యంగా ఇలా చూడడం వల్ల అపనిందల పాలవుతారని పెద్దలు చెబుతారు. అయితే ఇలా చూడడం వల్ల నిజంగానే జరుగుతుందా అంటే అవును అని అంటున్నారు శాస్త్ర నిపుణులు.. దీని వెనక పెద్ద చరత్ర దాగి ఉందని పూర్వీకులు తెలిపారు. అయితే ఆ చరిత్ర ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పార్వతి దేవి పిండితో కైలాసంలో ఓ బాలుడికి ప్రాణం పోసి కాపాలగా పెడుతుంది. ఇదే తరుణంలో పరమేశ్వరడు అక్కడికి వెళ్తారు. దీంతో ఈ బాలుడు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటాడు. అయితే ఇలా అడ్డుకోవడంతో శివునికి కోపం వస్తుంది. ఇలా ఆగ్రహానికి గురైన శివుడు బాలుడి తలను త్రిశూలంతో తొలగిస్తాడు. అప్పుడు బారీ శబ్దం వెలుబడుతుంది. అయితే ఈ శబ్దాన్ని విని పార్వతి బయటకు వస్తుంది. ఇందలోనే ఆ బాలుడి తల మొండెం వేరవుతుంది.


అయితే ఈ ఘటనను చూసి పార్వతి తీవ్ర ఆవేదనకు గురవుతుంది. అంతేకాకుండా తీవ్రంగా రోధిస్తుంది. అయితే పార్వతి బాధను చూసి పరమేశ్వరుడు కరిగిపోయి.. తూర్పు దిశలో ఉన్న ఏనుగు తలను తెప్పించి బాలుడికి అతికించి ప్రాణం పోస్తాడు ఆ పరమేశ్వరుడు. దీంతో ఆ బాలుడికి గజాననుడు అనే పేరు కూడా పెడతారు. అయితే ఓ సందర్భంలో ఏనుగు తలను చూసి చంద్రడు నవ్వుతాడట.. దీంతో గణేషుడు తీవ్ర ఆగ్రహానికిలోనై చందమామను శపిస్తాడు. వినాయక చవితి (Ganesh Chaturthi) రోజున చంద్రుడిని చూస్తే.. నీలాపనిందలను ఎదుర్కొంటారని చరిత్రలు చెబుతున్నాయి. అయితే వినాయకుడి అక్షింతలు ధరించి చందమామను చూస్తే శాపం వర్తించదని శాస్త్రం చెబుతోంది. అందుకే తెలిసిన చాలా మంది చందమామను చూడరు.


Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..


Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook