Mahadhan Rajyog: `మహాధన రాజయోగం`తో ఈ రాశులకు పట్టనున్న అదృష్టం.. మీది ఉందా?
Jupiter Rise 2023: దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. రీసెంట్ గా మేషరాశిలో గురుడు ఉదయించాడు. దీని కారణంగా మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Guru Uday In Mesh 2023: నవగ్రహాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన గ్రహంగా దేవగురు బృహస్పతిని భావిస్తారు. గురు గ్రహం ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది. బృహస్పతి సాత్విక గ్రహం. గత నెల 27న గురుడు మేషరాశిలో ఉదయించాడు. దీని కారణంగా మహాధన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశికి చెందిన లగ్న గృహంలో బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పని లేదా వ్యాపారంలో విజయం సాధిస్తారు. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది.
కర్కాటక రాశి
మహాధన రాజయోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జాతకంలోని తొమ్మిదో ఇంట్లో బృహస్పతి ఉదయించబోతున్నాడు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో శనిదేవుడిని పూజించడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ధన రాజయోగం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి యెుక్క ఐదవ ఇంట్లో బృహస్పతి సంచరించబోతున్నాడు. దీంతో మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ పిల్లలు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. లవ్ జర్నీ బాగుంటుంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Gajlaxmi Rajyog 2023: గజలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు తిరుగులేనంత ధనం.. ఈ జాబితాలో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook