Horoscope Today 16 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 16వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీరు మీ ఆధ్యాత్మిక విషయాలతో తీరిక లేకుండా గడపనున్నారు. పెట్టుబడులకు తగిన లాభాలు గోచరిస్తున్నాయి. పనిచేసే చోట మీ యజమానితో మీ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. ఇది భవిష్యత్తులో ప్రమోషన్‌కు అవకాశం కల్పించవచ్చు.  అనారోగ్య సమస్య బాధిస్తుంది.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


వృషభ రాశి
మీ యజమాని మీ పనిని గమనిస్తున్నందున ఆఫీసులో ప్రమోషన్ లేదా ఉన్నత పదవులను పొందుతారు. వ్యాపారులకు నేడు అంతగా కలిసిరాదు. నగదు సమస్యలను పరిష్కరించుకోవడానికి యత్నిస్తారు. మీ తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై ఆలోచన మొదలవుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


మిథున రాశి
మీరు ఈ రోజు చంద్రుని ప్రభావం ఉంటుంది. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన కొన్ని చెల్లింపులు నేడు చేతికి అందుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల దృష్టిసారిస్తారు. అనారోగ్య సమస్యల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా రుణాల కోసం యత్నిస్తారు.


కర్కాటక రాశి 
మీ మాటలు, తెలివితేటలతో బ్యాంకు సమస్యలను పరిష్కరించుకుంటారు. అభిప్రాయాలలో భేదాలల కారణంగా ఇంట్లో సభ్యులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. కెరీర్ ఎంచుకోవాలనుకునే వారికి, కెరీర్ మార్చుకోవాలనుకునే వారికి కొత్త మార్గంలో వెళ్లడానికి ఇది తగిన సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు అన్ని విషయాలు కలిసొస్తాయి.


సింహ రాశి
ఈ రోజు మీ ఉద్యోగాన్ని మార్చడానికి మీరు ప్లాన్ చేయవచ్చు. ప్రేమ మరియు సంబంధాల విషయాలల శుభవార్త అందుతుంది. తల్లిదండ్రులు ఈ రోజు మీరు వారి బాగోగులు చూడాలని భావిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఇది మంచి సమయం. కొన్ని శుభవార్తలు అందుతాయి. 


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


కన్య రాశి
నేడు కన్య రాశి వారు ఏదైనా కొనుగోలు చేస్తున్నట్లయితే అన్ని పత్రాలు పరిశీలించిన తరువాత సంతకం చేయాల్సి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇల్లు మరియు ఇతర పరిసరాలను శుభ్రంగా మరియు శుభ్రంగా ఉంచాలి. పనిలో ఒత్తిడి ఎదురైతే కొంత విరామం తీసుకోవడం శ్రేయస్కరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి.


తులా రాశి
ఈరోజు తులా రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. నూతన ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రారంభించడానికి మీకు ఆర్థిక సహాయం సైతం అందే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక సమస్యలు చికాకు తెప్పిస్తాయి. బంధువులు, సోదరులతో కొన్ని కీలక విషయాలపై చర్చిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది.


వృశ్చిక రాశి
గత కొంతకాలం నుంచి ఎదుర్కొన్న నష్టాలు తొలగిపోయి, లాభాల దిశగా అడుగులు పడనున్నాయి. ఈరోజు మీరు కొంత సమయం సంతోషంగా ఉంటారు. పనిచేసే చోట ఆఫీసులో కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. భార్యాభర్తలు తమ జీవితంలో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది.


ధనుస్సు రాశి
మీరు ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఇది మీకు మంచి రోజు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మతపరమైన ప్రదేశాలు సందర్శించాలని భావిస్తారు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సలహా కోసం మీ వద్దకు వస్తారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పని బారం తగ్గనుంది.


మకర రాశి
ఈ రోజు చాలా కుట్రలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. సింగిల్స్ తమ సహోద్యోగి వైపు ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఉంది. మీ కెరీర్‌లో మీరు తీసుకుంటున్న మార్గాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు. దీని వల్ల కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్య ఉన్నవారు నేడు ఇంటి వద్ద ఉండటం శ్రేయస్కరం. శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడంతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


కుంభ రాశి
మీరు ఈ రోజు పనిలో తీరిక లేకుండా గడుపుతారు. మీ పని వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది. మీ జీవిత భాగస్వామిపై మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రద్ధ అవసరం. మీరు వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం కానుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


మీన రాశి
చాలా కాలం నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి ఈరోజు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. మీరు పనిలో మంచి పనితీరు కనబరుస్తారు. ఈ రోజు మీ ఇల్లు చాలా గజిబిజిగా ఉన్నందున శుభ్రం చేయాలని భావిస్తారు. విద్యార్థుల తమ అధ్యయనాలపై  దృష్టిసారించాలి. కుటుంబంలో నెలకొన్న విభేదాలు, సమస్యలు తీరతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook