Horoscope Today 22 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 22న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మేష రాశి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలతో ప్రమాదం సంభవించవచ్చు. లేదా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనేందుకు దారితీస్తుంది. ఉద్యోగులు, వ్యాపారాలకు కలిసొస్తుంది. చికాకులు తొలగిపోతాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మరియు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి అమలు చేస్తారు. శుభకార్యాలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. 


Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది


వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారికి చాలా మంచి రోజు. నేడు మీరు చాలా సరదాగా మరియు ఉల్లాసంగా గడుపుతారు. మీరు సాధారణంగా చేయని ఈవెంట్‌లను హాజరు కానున్నారు. సమాజంలో పలువురితో కలుస్తారు. అయితే కాస్త ధనవ్యయం చికాకు తెప్పిస్తుంది. దైవదర్శనం చేసే సూచన ఉంది. కష్టపడే తత్వాన్ని నేర్చుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.


మిథున రాశి
ఈ రోజు కొంత సమయం బాధగా గడుపుతారు. భావోద్వేగాలకు లోనవుతారు. ఇది మీకు చిరాకు, ఇబ్బందులను తీసుకురానుంది. అయినప్పటికీ మీ కోపాలను ఇతరులపై చూపడకుండా ఉండాలి. ఉద్యోగులు పనిలో రాణించి పేరు తెచ్చుకుంటారు. శుభవార్తలు అందుతాయి. 


కర్కాటక రాశి
మీరు పని భారంతో అలసిపోయినట్లు లేదా నిరాశ చెందుతున్నామని భావిస్తున్నారు. ఉద్యోగులకు అదనపు పనులు అప్పగిస్తారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ఆర్థికంగా ఆశాజనకంగా లేనందున పనులు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది.


సింహ రాశి
సింహ రాశి వారు నేడు ఒత్తిడికి గురవుతారు. అందుకు పరిష్కార మార్గాన్ని సులువుగా తెలుసుకుంటారు. చాలాకాలం తర్వాత మిత్రులను కలుసుకుంటారు. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ చుట్టుపక్కల వారిని సైతం ఆనందంగా ఉంచడానికి యత్నిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థలం లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.


Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం


కన్య రాశి
అయోమయాన్ని వీడతారు. మీ ప్రాధాన్యతలను గుర్తించి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు సత్ఫలితాలు రానున్నాయి. ఆలోచనలతో మీ రోజులో ఎక్కువ భాగం వృథా అవుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు. 


తులా రాశి
మీ బంధువులు, సన్నిహితుల వివాద పరిష్కారానికి సమస్వయకర్తగా ఉంటారు. మీరు ఇక్కడ పెద్దగా భావించి నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయం న్యాయంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు త్వరగా పూర్తికానందున ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులకు కలిసిరాదు. వ్యాపారుల పరిస్థితి అంతంత మాత్రమే ఉండనుంది. 


వృశ్చిక రాశి
ఈరోజు మీకోసం తలుపులు తెరుచుకోనున్నాయి. మంచి మాటతో కొందరు మీకు దగ్గరవుతారు. కొంతమంది స్నేహితులను ఇంటికి ఆహ్వానించి, ఆనందంగా గడుపుతారు.  రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటారు. 


ధనస్సు రాశి
భిన్న అభిప్రయాలు ఉండే పలువురు వ్యక్తులను కలుసుకుంటారు. అయితే వారి కోణంలో ఆలోచిస్తే అవతలి వ్యక్తుల అభిప్రాయం సరైనదేనని గుర్తించాలి. శ్రమకు తగ్గ ఫలితం రానుంది. ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కష్టించి పనిచేసే ఉద్యోగులకు మేలు జరగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు 


మకర రాశి
ఈరోజు ఇతరుల నుంచి ప్రేరణ పొందుతారు. మీ కుటుంబం లేక స్నేహితుల సహకారంతోనే పని ప్రారంభిస్తారు. ఒంటరిగా ముందుకు వెళ్లేందుకు కాస్త వెనకడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. న్యాయంగా కష్టపడే వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


కుంభ రాశి
మీరు సరదాగా గడపాలని భావిస్తారు. అయితే మీ స్నేహితుడు సాయం కోరి మీ తలుపు తట్టనున్నాడు. వారిని అపహాస్యం చేయడానికి బదులుగా వీలైతే చేతనైన సాయాన్ని చేయండి. ఈరోజు ఉద్యోగులు, వ్యాపారులకు అంత శ్రేయస్కరం కాదు. తద్వారా కుటుంబంలో కాస్త మాట పట్టింపులు, స్వల్ప వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి.


మీన రాశి
మీ పని కోసం ఈరోజు నమ్మకమైన వారిని ఎంచుకుంటారు. దీని వల్ల మీకు లాభం చేకూరనుంది. పనులు నత్తనడకన సాగనున్నాయి. దీంతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇతరుల మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు యత్నిస్తారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ఓపికగా, సంయమనంతో వ్యవహరించాలి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook