Horoscope Today 23 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 23వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నగదు సమస్య గురించి ఆందోళన చెందుతుంటే నేడు మీకు పరిష్కారం దొరుకుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ తప్పిదాలను తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. మీరు ఉద్యోగం మారడం లేదా కొత్త వెంచర్ ప్రారంభించడం గురించి ఆలోచిస్తుంటే, ఈ రోజు కలిసొస్తుంది. అయితే ఆలోచన లోకుండా అడుగు వేయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


వృషభ రాశి
ఈ రోజు మీరు ఏ చికాకు లేకుండా ఆనందంగా గడపాలని భావిస్తారు. తీరిక లేకుండా చేస్తున్న పని నుంచి కాస్త విరామం తీసుకోవాల్సిన సమయం ఇది. ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 


మిథున రాశి
మీ జీవితం ఎలా మారబోతుందనే ఆలోచన మొదలవుతుంది. గతాన్ని మరచిపోయి, ముందుకు సాగడానికి ప్రయత్నించండి. కొత్త స్నేహితులు మరియు నూతన పరిచయాలు ఈరోజు మీ దారిలోకి వస్తాయి. నూతన పరిచయాల ద్వారా అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు పని బారం తగ్గనుంది. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం గోచరిస్తుంది.


కర్కాటక రాశి 
ఈ రోజు మీ సహాయకులు, సన్నిహితులతో మాట్లాడటానికి కర్కాటక రాశి వారు ప్రయత్నిస్తారు. దీని వల్ల మీకు మేలు జరగనుంది. స్నేహితుడికి సహాయం చేయడానికి సమయం కేటాయిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. సన్నిహితులు నుంచి కొన్ని వార్తలు అందుకుంటారు. వ్యాపారాలు ఫలితాలు అంతంత మాత్రమే ఉంటాయి.


సింహ రాశి
ఈ రోజు ప్రతిదానికీ అవును అని చెబుతూ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆధిపత్యాన్ని కొంతకాలం దూరంగా ఉంచండి. అదే సమయంలో మీకు అంది వచ్చే కొత్త ఆఫర్లను అంగీకరించడానికి ప్రయత్నించండి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


కన్య రాశి
అన్ని సమయాలలో ఒకే చోట ఉండడం మీ ఉత్పాదకత మరియు సృజనాత్మకతను ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడూ అనుకోని పనులను చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు.


తులా రాశి
ఈ రోజు మీరు భావోద్వేగాలలో మునిగిపోతారు. అందుకు బదులుగా ఒక రోజు సెలవు తీసుకొని మీ ఆఫీసు పనులను, లేదా వ్యాపార పనులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. మానసిక ప్రశాంత కోసం ఈ రోజు ధ్యానం చేయడానికి సమయాన్ని వెచ్చించండి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు పనులు సజావుగా సాగుతాయి.


వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి కొంచెం తక్కువ నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యవహారాలను మీ చేతుల్లోకి తీసుకోవాలి. మీ ప్రయత్నాలకు ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. ఇతరుల కుట్రలను తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వ్యాపారులు లాభసాటిగా ఉంటాయి. చాలా కాలం తరువాత మిత్రులను కలుసుకుని సరదాగా సమయాన్ని గడుపుతారు.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


ధనుస్సు రాశి
మీరు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. చాలా సమయం ఒకచోట ఉండటానికి కుదురుగా ఉండలేరు. మీరు కొంతకాలంగా కోరుకుంటున్న విరామం తీసుకుని సరదాగా గడపండి. ప్రయాణాల కారణంగా స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు మార్పులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.


మకర రాశి
మీకు బాగా తెలిసిన వాటితో గంటల గంటలపాటు కూర్చుంటే మీరు కొత్త విషయాలు నేర్చుకోలేరు. మీ దృఢమైన వ్యక్తిత్వం మీకు పరీక్ష పెట్టనుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుని మీ కెరీర్ గురించి ఆలోచిస్తారు. ప్రయాణాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులు కొన్ని విషయాల వల్ల వివాదాలలో చిక్కుకుంటారు.
 
కుంభ రాశి
గతం గురించి ఆలోచించడం ద్వారా ప్రయోజనం లేదు. గతాన్ని మీరు ఎలాగూ మార్చలేరు. అయితే భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లో ఉంది. మీ ఆరోగ్యం మరియు వృత్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. గతంలో ఏమి జరిగిందో మర్చిపోవటానికి ప్రయత్నించండి మరియు మీపై మరియు భవిష్యత్తు కోసం మీ నిర్ణయాలపై నియంత్రణ అవసరం. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.


మీన రాశి
మీ జీవిత భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను అర్థం చేసుకోలేరు. వారితో చర్చించి మీ సమస్య పరిష్కరించుకోండి. చెప్పడం కన్నా చెయ్యడం మిన్న అని మీరు నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులు పెట్టుబడులతో ముందుకు సాగనున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook