Horoscope Today 25 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 25వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
మీరు ప్రతి రాత్రి విందువినోదాలకు వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది. మరియు కొంతకాలం ఇంట్లో వండిన భోజనాన్ని ఆస్వాదించండి. లాభదాయకమైన పని అవకాశాలు వచ్చే నాలుగు వారాల పాటు మీ మార్గంలోకి రానున్నాయి. ఉద్యోగం కోసం మీ ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకోండి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. నేడు మేష రాశి వారికి ధనలాభం గోచరిస్తుంది.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


వృషభ రాశి
మీకు మాత్రమే కావాలని కోరుకుంటారు. కొన్ని విషయాలలో దౌర్జన్యం చేయాలని యత్నిస్తారు. మీ లోపల అసూయ దాగి ఉంటుంది. కొత్త వ్యక్తులను కలవడానికి తగిన సమయం కాదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులు ఎంతగా శ్రమించిన ఆశించిన ఫలితాలు రావు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.  


మిథున రాశి
స్పష్టమైన వెంచర్ పని లేదా ఇంటికి పునరుద్ధరించే కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తారు. మీకు ఎవరితోనైనా చర్చ ఇబ్బందికరంగా మారుతుంటే హేతుబద్ధంగా పరిష్కరించుకోవాలి. ఇతరులకు కేవలం మీ అభిప్రాయం చెప్పండి, నమ్మించడానికి యత్నించరాదు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. చేతికొస్తాయని భావించిన కొన్ని పనులు ఇతరులకు అందుతాయి.


కర్కాటక రాశి 
మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తిగా ఉంటారు. మీరు ఆలోచించి నమ్మకస్తులతో చేతులు కలపడం ద్వారా శుభాలు కలుగుతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. గత కొన్ని రోజులుగు ఇబ్బందికి గురిచేస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.


సింహ రాశి
ఏదైనా బయటకు వెళ్లడానికి అవకాశం ఇచ్చే ముందు మీ మెదడు, మనసుతో ఆలోచించాలి. శ్రమ అధికమైతే కాస్త విరామం తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో చికాకుల కారణంగా విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాలు చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


కన్య రాశి
కొత్త మార్గంలో వెళ్లడానికి మిమ్మల్ని అనుమతించే వనరులను సిద్ధం చేయండి. ప్రగల్భాలు పలకడానికి బదులుగా పరిస్థితిని అర్థం చేసుకుని ముందడుగు వేయాలి. ప్రతి ఒక్కరూ అన్ని విషయాలలో విజయాలు సాధించడం సాధ్యం కాదని గ్రహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు.


తులా రాశి
కొన్ని విషయాలలో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎవరైనా మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నందున మీరు ఎక్కడికి వెళుతున్నారో ఆలోచించి అడుగులు వేయాలి. ఉద్యోగులకు ఎలాంటి సహకారం అందదు. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలు పెడతారు.


వృశ్చిక రాశి
కలలు కనడం మానివేసి, వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుని వ్యవహరించండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గత కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్న పెట్టుబడులు మీ దారికి చేరుకుంటాయి. కొన్ని శుభవార్తలతో మీ ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. 


ధనుస్సు రాశి
అనవసరంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానివేయాలి. చంద్రుడి ప్రభావంతో మీరు అసౌకర్యానికి గురవుతారు. మీకు ఏం జరుగుతుందో దాన్ని మీరు నియంత్రించలేరు. మీ చుట్టూ ఉన్న కొందరు తమ జిత్తులు ప్రదర్శించేందుకు యత్నిస్తారు. ఉద్యోగులకు అంతా సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


మకర రాశి
మీ విలక్షణమైన మనస్తత్వంతో కెరీర్ గురించి ఆలోచిస్తారు. దూకుడును తగ్గించుకుని, ఇతరులతో మర్యాదగా మాట్లాడాల్సి ఉంటుంది. నేడు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
 
కుంభ రాశి
కొన్ని విషయాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. ఏదేమైనా సరే ప్రతి సందర్భంలోనూ అద్భుతాలను ఆశించవద్దు. పనిని పూర్తి చేయడానికి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకోలేరు. ఆర్థిక సమస్యల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


మీన రాశి
మీ ఖచ్చితమైన ప్రమాణాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న కొందరు నూతన ఆవిష్కరణలు చేస్తారు. ఒకవేళ మీరు పని కోసం చూస్తున్నట్లయితే, కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook