Horoscope Today May 5 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ ఉద్యోగ, వ్యాపార రీత్యా కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త బిజినెస్ కోసం ప్రయత్నాలు సాగిస్తారు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి ( Aries)


తోబుట్టువులతో చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ బాంధవ్యాలు బలపడుతాయి. మనోహరమైన వాతావరణం మిమ్మల్ని మరింత శక్తివంతులను చేస్తుంది. పనిలో మునుపటికన్నా విశేషంగా రాణిస్తారు. చేపట్టిన పనులను డెడ్ లైన్ కన్నా ముందే ఫినిష్ చేస్తారు. కష్టంలో ఉన్నవారికి తోచిన సాయం అందిస్తారు.


వృషభ రాశి (Taurus)


సోషల్ గెట్ టు గెదర్‌లో పాల్గొంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్లతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఇంటికి సంబంధించి కొన్ని విలువైన వస్తువులు, కళాకృతులు కొనుగోలు చేస్తారు. మీ దగ్గరి బంధువు నుంచి శుభవార్త ఒకటి వింటారు. ముఖ్యమైన పనులను లీడ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసిస్తారు. మీ టీమ్ సభ్యులను తగిన రీతిలో మోటివేట్ చేస్తారు.


మిథున రాశి (GEMINI)


పెద్దల ఆశీస్సులతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మీలో మునుపటికన్నా సహనం పెరుగుతుంది. చేపట్టిన పనులపై ఫోకస్ పెడుతారు. సకాలంలో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ, ఉద్యోగ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఖర్చులు తగ్గించుకుని బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటారు.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మీ మనస్సును ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతుంది. మీరు బద్దకంగా ఫీలవుతారు. అది మీ పనులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రేమికులు పెళ్లికి సంబంధించిన నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి బ్యాడ్ న్యూస్ తప్పదు. హాజరైన ఇంటర్వ్యూల్లో చేదు అనుభవం ఎదురవుతుంది.


సింహ రాశి (LEO)


మీ అంతరంగ శక్తి మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. మీ బద్దకాన్ని వదిలిస్తుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. మీ బాస్‌తో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 


కన్య రాశి (Virgo)


చంద్ర అనుగ్రహంతో మీరు చేపట్టిన పనుల్లో ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీ కృషి కారణంగా మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు గతం కన్నా మెరుగ్గా రాణిస్తారు. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయం మిమ్మల్ని సరైన దిశలో నడిపించడమే కాదు... మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కుటుంబ సంబంధ సమస్యలు సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. 


తులా రాశి (Libra)


ఇవాళ మీకు ఆశాజనకంగా గడుస్తుంది. పరిస్థితులు మెరుగవుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మికత మీ అంతరంగ శక్తిని మరింత ధృఢపరుస్తుంది. పుణ్యక్షేత్రాలు లేదా స్వచ్చంద సంస్థలకు తోచిన సాయం అందజేస్తారు. విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అకడమిక్ పరంగా విద్యార్థులకు సానుకూల సమయం. 


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ మిమ్మల్ని ఒంటరితనం వెంటాడుతుంది. ఒంటరితనంలో మిమ్మల్ని మీరు విశ్లేషించుకోగలుగుతారు. ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా స్థాన చలనం ఉంటుంది. కొన్ని సందర్భాలు మీ ఓపికకు పరీక్ష పెడుతాయి. అది మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అడ్వెంచర్ టూర్‌కు దూరంగా ఉండటం బెటర్.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఇవాళంతా పాజిటివ్ వైబ్రేషన్‌లో ఉంటారు. ఇంటి మరమత్తులకు సంబందించి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతర వ్యక్తులతో భాగస్వామ్యంతో కొత్త వ్యాపారం మొదలుపెడుతారు. మీ జీవిత భాగస్వామితో విలువైన సమయం గడుపుతారు. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. 


మకర రాశి (Capricorn) 


ఉద్యోగ రీత్యా విశేషంగా రాణిస్తారు. మీ బాస్ మీ టాలెంట్‌ను గుర్తిస్తారు. కొలిగ్స్ నుంచి ప్రశంసలు దక్కుతాయి. తద్వారా భవిష్యత్తులో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. తోబుట్టువులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి వారు కోరుకున్న జాబ్ దొరుకుతుంది.


కుంభ రాశి (Aquarius)


పిల్లల చదువుల్లో, ఇతరత్రా విషయాల్లో ఈరోజంతా బిజీ బిజీగా గడుపుతారు. విద్యార్థులు ఉన్నత చదువులపై ఫోకస్ చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్‌ అవకాశాలు ఉంటాయి. సింగిల్స్‌కు తగిన జోడీ దొరుకుతుంది. విద్యా, కన్సల్టేషన్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. 


మీన రాశి (Pisces) 


ఇవాళ మిమ్మల్ని నిరాశ, నిస్పృహలు వెంటాడుతాయి. మీ బాధ్యతలను మీరు సరిగా నెరవేర్చలేకపోతారు. పెట్టుబడుల్లో నష్టాల్లో చవిచూస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇంటి పునర్నిర్మాణ పనులు చేపడుతారు. ప్రస్తుతానికి మరమత్తులను వాయిదా వేయడం మంచిది. కొద్దిరోజుల పాటు మీకు ప్రతికూల ఫలితాలు తప్పకపోవచ్చు. 


Also Read: Umran Malik Fastest Delivery: ఐపీఎల్‌‌లో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు... తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్న బౌలర్


Also Read: SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి, ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.