SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి, ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం

SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. 207 పరుగుల భారీ స్కోరు ఛేధించలేక చతికిలపడింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2022, 11:47 PM IST
  • సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి
  • 21 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్‌పై విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్
  • 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన ఎస్ఆర్‌హెచ్ జట్టు
SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి, ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం

SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. 207 పరుగుల భారీ స్కోరు ఛేధించలేక చతికిలపడింది.

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ జట్టు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు ముందు నుంచే ధాటిగా ఆడింది. ఎంతలా ఆడిందంటే బౌలింగ్ ఎంచుకుని తప్పు చేశామా అని విలియమ్సన్ ఫీలయ్యేలా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి..207 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్, పావెల్ లు చెలరేగి ఆడారు. వార్నర్ 58 బంతుల్లో 92 పరుగుల చేయగా..పావెల్ 35 బంతుల్లో 67 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కు 66 బంతుల్లో 122 పరుగులు చేయడం విశేషం. కేవలం 63 బంతుల్లోనే వంద పరుగులు చేశారు. పదహారు ఓవర్ల ముగిసేసరికి..ఢిల్లీ కేపిటల్స్ జట్టు చేసింది 150 పరుగులే. మిగిలిన నాలుగు ఓవర్లలో 57 పరుగులు చేయడం గమనార్హం.

ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. 5వ ఓవర్ లోవిలియమ్సన్ రూపంలో రెండవ వికెట్ కోల్పోయింది. కాస్సేపటికి మూడవ వికెట్ రాహుల్ త్రిపాఠీ అవుటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును మర్ క్రమ్ కాస్త నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. 18.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులకు చేరుకుంది. నికోలస్ పూరన్ మెరుపువేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి..అవుటయ్యాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also read: IPL 2022 GT vs MI: ముంబై రెండో విజయాన్ని నమోదు చేస్తుందా ..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News