Janmashtami 2022: జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి, ఆగస్టు 18 లేదా ఆగస్టు 19నా, శుభ ముహూర్తం ఎప్పుడు
Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడనే విషయంలో ఈసారి చాలా గందరగోళం ఏర్పడింది. జన్మాష్టమి పూజ ఎప్పుడు చేయాలి, విధి ఎప్పుడుందనేది ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క వాదనగా ఉంది. ఈ క్రమంలో జన్మాష్టమి ఎప్పుడనేది తెలుసుకుందాం..
Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడనే విషయంలో ఈసారి చాలా గందరగోళం ఏర్పడింది. జన్మాష్టమి పూజ ఎప్పుడు చేయాలి, విధి ఎప్పుడుందనేది ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క వాదనగా ఉంది. ఈ క్రమంలో జన్మాష్టమి ఎప్పుడనేది తెలుసుకుందాం..
హిందూమతంలో జన్మాష్ఠమి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడి జన్మదినాన కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది జన్మాష్టమి విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. జన్మాష్టమి ఆగస్టు 18 లేదా ఆగస్టు 19. రెండింట్లో ఎప్పుడనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే అష్టమి తిధి అనేది ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమై..ఆగస్టు 19 రాత్రి వరకూ ఉంటుంది. అందుకే ఈ గందరగోళం.
జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి
జన్మాష్టమి వేడుక భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిధి నాడు జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడి జన్మం అష్టమి తిధి రోహిణి నక్షత్రంలో జరిగింది. ఈ క్రమంలో జన్మాష్టమి పూజలు ఎప్పుడు చేయాలి, పూజా విధి ఏంటనేది ఆసక్తిగా ఉంది. భాద్రపదంలోని కృష్ణపక్షం అష్టమి తిధి ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై..ఆగస్టు 19వ తేదీ రాత్రి 10 గంటల 59 నిమిషాలవరకూ ఉంటుంది. జన్మాష్టమి పూజ శుభ ముహూర్తం ఆగస్టు 18వ తేదీ రాత్రి 12 గంటల 3 నిమిషాల్నించి 12 గంటల 47 నిమిషాలవరకూ ఉంటుంది. ఏదైనా పండుగను ఎప్పుడూ ఉదయ తిధిలోనే జరపాలని చాలామంది భావిస్తారు. ఈ నేపధ్యంలో జన్మాష్టమి ఆగస్టు 19నే జరుపుకోవాలి. మత గ్రంధాల ప్రకారం శ్రీ కృష్ణుడు రాత్రి వేళ జన్మించినందున ఆగస్టు 18న జరుపుకోవాలని మరి కొందరు భావిస్తారు.
జన్మాష్టమి పూజా విధి
జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణుడిని బాలరూపంలో ఆరాధిస్తారు. జన్మాష్ఠమి రాత్రి 12 గంటలకు శ్రీ కృష్ణుడి పుట్టుక తరువాత పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలతో గోపాలుడిని అభిషేకిస్తారు. ఆ తరువాత శృంగారం నిర్వహిస్తారు. పూజ సమయంలో గోపాలుడికి వెన్న, పటికబెల్లం సమర్పిస్తారు. దాంతోపాటు బట్టలు, తులసీ ఆకులు, పండ్లు, పూలు అర్పిస్తారు. తరువాత ఉయ్యాలలో ఊపుతారు. చివరిగా పంచామృతంతో గోపాలుడిని అభిషేకిస్తారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.
Also read: Sun Transit 2022: సూర్యుడి సింహరాశి ప్రవేశం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook