June Planet Transit 2023: జూన్ నెల ఈ 5 రాశులకు చాలా ప్రత్యేకం.. ఇందులో మీరున్నారా?
June Planet Transit 2023: జూన్ లో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు కొన్ని రాశులవారికి మేలు చేయనుంది. వారికీ దేనికీ లోటు ఉండదు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
June Grah Gochar 2023: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తంది. జూన్ నెల ప్రారంభంకానుంది. ఆ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. జూన్ 7న బుధుడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు జూన్ 24న వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలో ఎంటర్ కానున్నాడు.
జూన్ 15న సూర్యుడు వృషభరాశిని విడిచి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. మరో రెండు రోజుల తర్వాత అంటే జూన్ 17న శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. అదే నెల చివరిలో అంటే జూన్ 30న అంగారకుడు సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. వచ్చే నెల ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
మేషరాశి
జూన్‌లో నాలుగు ముఖ్యమైన గ్రహాలు తమ గమనాన్ని మార్చనున్నాయి. ఈ గ్రహాల సంచారం మేష రాశి వారికి కలిసి రానుంది. మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్రి కలిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మిధునరాశి
మిథున రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆర్థికంగా బలపడతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
కన్య రాశి
ఈ రాశుల వారి అదృష్టం జూన్‌లో ప్రకాశించబోతోంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ఈ కాలంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు. పనులు పూర్తి చేయగలుగుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రజలు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలను పొందుతారు. భూమి లేదా వాహనం మొదలైనవి కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది.
Also Read: Gajkesari Yoga 2023: నేటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
తులారాశి
గ్రహాల సంచారం ఎంతో మేలు చేస్తుంది. మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే బలపడుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో కలిసి తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
మకరరాశి
మకర రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీకు జూన్ నెల చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
Also Read: Shukra Gochar 2023: మిథునరాశిలో శుక్ర సంచారం.. ఈ 3 రాశులవారు నష్టపోవడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook