Vakri Guru July 2022: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభ గ్రహంగా భావిస్తారు. జూలై 29న గురుడు మీనంలో తిరోగమనం (Jupiter Retrograde In Pisces 2022) చేయనున్నాడు. అక్కడే 24 నవంబర్ 2022 వరకు ఉంటాడు. గురుడు తిరోగమన ప్రభావం రెండు రాశులవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవే మీనం మరియు కన్య. ఈ రెండు రాశులవారు 119 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సమయంలో వీరు భారీగా బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు తప్పనిసరిగా ఉదయం నడక, వ్యాయామం చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువు బరువును పెంచుతాడు
తిరోగమన బృహస్పతి మీన రాశిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే బృహస్పతి ఈ రాశిలోనే ఉన్నాడు కాబట్టి. గ్రహాల్లోకెల్లా అతిపెద్ద గ్రహం మరియు అత్యంత బరువైన గ్రహం గురుడు. బృహస్పతి తిరోగమనంలో ఉంటే ఆ రాశి యెుక్క వ్యక్తి బరువు కూడా పెరుగుతుంది. మీనరాశిలో చంద్రుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు. చంద్రుడు లగ్నం స్థానంలో ఉండటం వల్ల కూడా వ్యక్తి యెుక్క బరువు పెరుగుతుంది. ఈ సమయంలో థైరాయిడ్, కీళ్ళనొప్పులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు..ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మెడిసిన్‌తో పాటు వ్యాయామం కూడా చేయండి.  


ఈ రాశివారు వేపుడులను తగ్గించాలి
గురు తిరోగమనం కన్యారాశివారి బరువును, ఉబకాయాన్ని పెంచుతుంది. వీరు వేపుడ్లు, అయిల్ పుడ్ కు దూరంగా ఉండాలి. వీరు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే మంచిది. కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. 


పరిహారాలు
>> ఆహారాన్ని తగ్గించుకోవాలి. అంతేకాకుండా గుడి పూజారికి కుట్టని బట్టలు దానం చేయండి. అలా చేయడం ద్వారా గురువు సంతోషిస్తాడు.
>> ఆవుకి భోజనం పెడితే బృహస్పతి సంతోషించి మీ కోరికలను తీరుస్తాడు.  
>> ఇంట్లోని పెద్దలకు సేవ చేసి వారి పట్ల విధేయత చూపండి.


Also Read: Kamika Ekadashi 2022: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రతంలో పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook