Jupiter Retrograde: 119 రోజులపాటు బృహస్పతి తిరుగమనం.. ఈ రాశి వారికి జాక్‌పాట్ తగిలినట్టే.. ఎటు చూసినా డబ్బులే..
Jupiter Retrograde In Telugu: కొన్ని రాశుల వారు దేవగురువు గృహస్పతి తిరుగమనం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Jupiter Retrograde In Telugu: దేవ గురువు బృహస్పతి కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి కొన్ని రాశుల వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి. అక్టోబర్ 9వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశించిన బృహస్పతి అతి త్వరలోనే తిరోగమనం చేయబోతున్నాడు. ఏదైనా ఒక గ్రహం రివర్స్లో తిరిగితే దానిని జ్యోతిష్య శాస్త్రంలో తీరోగమనముగా భావిస్తారు. ఈ తిరోగమన ప్రభావం వల్ల కూడా ద్వాదశ రాశుల వారిపై ఎఫెక్ట్ పడుతుంది. దీని కారణంగా కూడా అన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దేవ గురువు గృహస్పతి వృషభ రాశిలో డిసెంబర్ 9వ తేదీన 12 గంటల సమయంలో తిరుగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా రేపటి నుంచి ఏయే రాశులు ప్రభావితం అవుతాయో తెలుసుకోండి.
తిరోగమనం దశలో బృహస్పతి:
బృహస్పతి గ్రహం మళ్లీ వచ్చే సంవత్సరంలోని ఫిబ్రవరి 4వ తేదీన ప్రత్యక్ష మార్గంలో ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఈ తిరోగమనం కారణంగా ఏర్పడే ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 119 రోజులు బృహస్పతి తిరుగమనం లో ఉండడంవల్ల కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా తిరోగమనంలో ఉన్నన్ని రోజులు కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు, అదృష్టం రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి
బృహస్పతి రోగమనం ప్రభావం మిథున రాశి వారిపై ఎక్కువగా పడుతుంది. దీనివల్ల 119 రోజులపాటు వీరికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రాష్ట్ర వారికి నూతన ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా మిధున రాశి వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించే అదృష్టాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యల్లో కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి చేతికి వస్తాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి కూడా బృహస్పతి రోగమనం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడమే కాకుండా ..ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించిన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు పనులల్లో కష్టపడే వారికి కూడా తగిన ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. దీంతోపాటు వర్తక వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి.
Also Read:Lucky Zodiac Sign: ధనుర్మాసంలో సంసప్తక యోగం.. రాజభోగాలు, అష్టైశ్వర్యాలతో ఈ రాశులవారు బిజీ బిజీ..
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆదాయంలో పురోగతి లభించడమే కాకుండా గతంలో చేయి జారిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. దీంతోపాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో ఎలాంటి మంచి పనులు చేసిన విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఫిబ్రవరి నెల వరకు కర్కాటక రాశి వారు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించిన విపరీతమైన డబ్బులు పొందడమే కాకుండా సమాజంలో మంచి పేరు కూడా పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Rasi Phalalu: ఈ వారం 6 రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్.. ఇందులో మీరు కూడా ఉన్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.