Dhanurmasam 2024 Lucky Zodiac Sign: ధనుర్మాసంలో సూర్యుడుతో పాటు అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Dhanurmasam 2024 Lucky Zodiac Sign: సూర్యగ్రహం ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి తప్పకుండా సంచారం చేస్తూ ఉంటుంది. ఈ నెలలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి దీనిని తెలుగు క్యాలెండర్ ప్రకారం ధనుర్మాసంగా పిలుస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ ధనుర్మాసంలో శుక్ర, కుజ గ్రహల కయిక కూడా జరిగనుంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన సంసప్తక యోగం ఏర్పడనుంది.
సంసప్తక యోగం ఏర్పడడం కారణంగా మేష రాశి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.
మేష రాశివారికి డిసెంబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి సమయంలో గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా భూమి, ఆస్తులు కూడా కొనుగోలు చేసేవారికి చాలా బాగుంటుంది. అలాగే మేష రాశివారికి వివాహాలు జరుగుతాయి.
ఉద్యోగాలు చేసే సింహ రాశివారికి సంసప్తక యోగం ఏర్పడడం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే వీరికి సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ఠలు కూడా లభిస్తాయి.
డిసెంబర్ నెలలో కన్యరాశివారికి కూడా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో తీర్థయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.
తులా రాశివారికి కూడా ఈ డిసెంబర్ నెలలో అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి సీనియర్ల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. దీంతో పాటు కీర్తి కూడా పెరుగుతుంది. ఆనందం రెట్టింపు అవ్వడమే కాకుండా కోరికలు కూడా నెరవేరుతాయి.