Jupiter will Rise in Aries on 27th April 2023: వేద జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని అదృష్టానికి, జ్ఞానానికి మరియు సంతానికి కారకుడిగా భావిస్తారు. ఎవరి జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటారో వారు ప్రతి పనిలో విజయవంతం అవుతారు. ప్రస్తుతం బృహస్పతి తన సొంత రాశి అయిన మీన రాశిలో సంచరిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత గురుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యూపిటర్ యెుక్క ఈ సంచారం ఏప్రిల్ 22న జరగబోతుంది. దీని అనంతరం ఏప్రిల్ 27న గురుడు మేషరాశిలో ఉదయిస్తాడు. గురుడు ఉదయం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి: గురుడు ఉదయించడం వల్ల సింహ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా ఉంటుంది. జాబ్ చేసేవారు ప్రమోషన్ పొందితే, వ్యాపారస్తులు పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. మీకు మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 


కుంభం: గురు గ్రహ సంచారం కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు శని పీడ నుండి విముక్తి లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. మీకు కొత్త వనరుల నుండి ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులు లాభపడతారు. మీ కెరీర్ అద్బుతంగా ఉండబోతుంది. 


Also Read: Grahana Dosham: 18 ఏళ్ల తర్వాత రాహువు యెుక్క వలలో సూర్యుడు... ఈ 3 రాశులవారి జీవితం నాశనం..


మేషం: ఇదే రాశిలో గురుడు ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మేషరాశి వారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. అంతేకాకుండా మేషరాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది.  


మిథున రాశి : బృహస్పతి సంచారం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు భారీగా ఆదా చేస్తారు. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 


Also read: Budh Gochar 2023: రాబోయే 58 రోజులు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు... ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి