Surya Guru Yuti 2023: మేష రాశిలో గురు, సూర్యుల కలయిక.. ఏప్రిల్ 23 నుండి ఈ 4 రాశులకు మహర్దశ!

Surya Guru Yuti 2023 Shubh Yog: ఈ నెల 22న గురుడు, సూర్యుడు కలయిక మేషరాశిలో జరగబోతుంది. దీని కారణంగా ఓ శుభకరమైన యోగం ఏర్పడుతుంది. వీరిద్దరి సంయోగం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 11:17 AM IST
Surya Guru Yuti 2023: మేష రాశిలో గురు, సూర్యుల కలయిక.. ఏప్రిల్ 23 నుండి ఈ 4 రాశులకు మహర్దశ!

Surya Guru Conjunction in Aries on 22nd April 2023: ఈ నెలలో కొన్ని పెద్ద గ్రహాల గమనంలో మార్పు రాబోతుంది. ఇప్పటికే ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు తన రాశిని మార్చాడు. మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 14న సూర్యుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది జరిగిన వారం రోజులకు అంటే ఈనెల 22న గురుడు కూడా మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఒకే రాశిలో సూర్యుడు, గురుడు కలయిక వల్ల శుభయోగం ఏర్పడబోతుంది. పుష్కర కాలం తర్వాత ఈయోగం రూపొందుతుంది. ఈ యోగ ప్రభావం నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

కర్కాటకం
కర్కాటక రాశి యొక్క పదవ ఇంట్లో సూర్యుడు, బృహస్పతి సంయోగం జరగబోతుంది. దీంతో ఈ రాశి వారు కెరీర్ లో పురోగతి సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. 

మిథునం
ఈ రాశి యెుక్క 11 వ ఇంట్లో సూర్యుడు, గురుడు కలవబోతున్నారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది.  ఆఫీసులో విషయాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. ఫ్యామిలీ సపోర్టు కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 

Also Read: Sun transit 2023: మరో 5 రోజుల్లో ఏప్రిల్ 14 నుంచి ఆ 3 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయం 

మీన రాశి
మీన రాశి యెుక్క రెండో ఇంటిలో సూర్యుడు, బృహస్పతి కలయిక జరగబోతుంది. దీంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

సింహరాశి
ఈ రాశి యొక్క తొమ్మిదవ ఇంటిలో సూర్యుడు, బృహస్పతి మీట్ అవ్వబోతున్నారు. మీరు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీకు భారీ ప్యాకేజీతో జాబ్ వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also Read: Navapancham Rajayogam: 300 ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమ రాజయోగం.. ఈ 4 రాశులవారి జీవితం ఆనందమయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News