Lohri 2024: లోహ్రీ పండగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండగ ప్రాముఖ్యత తెలుసుకోండి..
Lohri 2024: పంజాబ్ రాష్ట్రంలో లోహ్రీ (Lohri 2024) పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండగ పురాతన కాలం నుంచి వస్తోంది. అయితే ఈ పండగ జరుపుకోవాలని ప్రధాన కారణాలేంటో మీకు తెలుసా? లోహ్రీ పండగ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lohri 2024: లోహ్రీ పండగ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండగను బీహార్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ ఈ సంవత్సరం జనవరి 13వ తేదీన వచ్చింది. లోహ్రీ (Lohri 2024) పండగ చలికాలం ముగింపును సూచిస్తుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ పండగకు ముందే పంజాబీ రైతులు తమ చేతికి వచ్చిన పంటలను కోసుకొని.. తర్వాత వచ్చే కొత్త సంవత్సరంలోని తొలి పంట వేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండగ పంజాబీలకు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ.. కాబట్టి చిన్న పెద్ద ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో ఈ పండగను జరుపుకుంటారు.
అంతేకాకుండా ఈ లోహ్రీ పండగ రోజు రైతులు వారి చేతికి వచ్చిన దిగుబడి చూస్తూ సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే సందర్భంలో వారంతా నృత్యాలు చేస్తూ ఆనందంగా ఈ పండగ రోజంతా గడుపుతారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు వారి వారికి ఇష్టమైన తీపి పదార్థాలను తింటూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలోని పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాలలో ఈ పండగ సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అలాగే చండీగఢ్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ పండగ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ లోహిరి పండగ రోజు అక్కడి స్త్రీలు కొత్త దుస్తులు ధరించి రుచికరమైన వంటకాలను ఆస్వాదించి ఆనందంతో నృత్యాలు చేస్తారు.
ముఖ్యంగా లోహ్రీ (Lohri 2024) పండగను చండీగఢ్లోని గురుద్వారాల వద్ద మరంతో ఘనంగా జరుపుకుంటారు. గురుద్వారాలను కలర్ కలర్ లైట్లతో అలంకరిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో భోగిమంటను కూడా వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక అమృత్సర్ వంటి ప్రాంతాలలో కూడా ఈ లోహ్రీ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు అమృత్సర్లోని కొన్ని ప్రాంతాలలో స్థానికులంతా తీపి వంటకాలను చేసి వాటిని తింటూ ఆస్వాదిస్తారు. అంతేకాకుండా ఒకరికొకరు బహుమతులను ఇచ్చుకుంటూ ఈ రోజంతా ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు మరి కొంతమంది అక్కడే ఉన్న గోల్డెన్ టెంపుల్ ని సందర్శిస్తారు.
ఇక ఈ లోహ్రీ పండగను ఢిల్లీ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు మార్కెట్లన్నీ బెల్లం రుచికరమైన వంటకాలతో నిండి ఉంటాయి. అక్కడ నివసించే సిగ్గు ప్రజలంతా కాటన్ కొత్త దుస్తులను ధరించి.. ఎంతో ఆనందంతో గాలిపటాలని ఎగరవేస్తారు. అంతే కాకుండా మిఠాయిలను పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో సంక్రాంతి పండగను జరుపుకోవడం పూర్వీకుల నుంచి వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter