Lucky Zodiac Sign in Year 2023: 2022 సంవత్సరం ముగిసి 2023 నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. అయితే చాలా మంది రాశి చక్రాల మీద అసక్తి ఉన్నవారు.. 2023 సంవత్సరంలో తమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఇదే నెలలో పెద్ద గ్రహాలైనా బృహస్పతి, శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో 12 రాశువారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో 3 రాశువారు ఊహించని స్థాయిలో లాభాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం గుడ్‌లక్కే..
ధనుస్సు రాశి:
పెద్ద గ్రహాల సంచారం వల్ల ధనస్సు రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా జనవరి 17వ తేదిన జరిగే శని గ్రహ సంచారం వల్ల సడే సతి నుండి విముక్తి పొందుతారు. ముఖ్యంగా ఈ క్రమంలో నిలిచిపోయిన పనులన్ని జరుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వ్యాపార కార్యక్రమాలు చేసే వారు ఊహించని లాభాలు పొందే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా పూర్వీకుల నుంచి ఆస్తులు పొందుతారు.


మకరరాశి:
కొత్త సంవత్సరంలో మకరరాశి వారికి శని రెండవ స్థానంలో ఉండబోతోంది. దీని కారణంగా బృహస్పతి గ్రహం నాలుగవ స్థానంలోకి వెల్లబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి ఏడాది పొడవునా లక్ష్మి దేవి అనుగ్రహం లభించనుంది. దీని కారణంగా సంవత్సరం మొత్తం ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చుస్తున్నవారికి ఈ క్రమంలో లభించే అవకాశాలున్నాయి.


మేష రాశి:
కర్మ ప్రసాదించే శని మేష రాశికి 11వ స్థానంలో ఉండే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం సంతోషంగా జీవిస్తారు. అయితే ఈ రాశువారు డబ్బు పరంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Gas Cylinder Price: న్యూ ఇయర్ తొలి రోజే షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు


Also Read: IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook