Makar Sankranti 2023: సూర్యుడు మకరరాశిలోకి సంచారం చేయడంతో సంక్రాంతికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఈ పండగను ప్రతి సంవత్సరం పౌషమాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. అయితే మన దేశంలో సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అయితే ఈ రోజు లక్ష్మి దేవి, సూర్యభగవానుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే మకర సంక్రాంతిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే ఏయే రాష్ట్రాల్లో ఎలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాష్ట్రాల్లో ఇలా పిలుస్తారు:
కేరళ - మకర సంక్రాంతి
అస్సాం - మాఘ బిహు
హిమాచల్ ప్రదేశ్‌ - మాఘి సజీ
జమ్మూ - మాఘి సంగ్రాండ్, ఉత్తరాయణ్
హర్యానా - సక్రత్
బీహార్‌ - దహీ చురా
ఒడిశా - మకర సంక్రాంతి
కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్ - పౌష్ సంక్రాంతి లేదా మోకోర్ సోంక్రాంతి
ఉత్తరప్రదేశ్- ఖిచ్డీ
ఉత్తరాఖండ్ - ఉత్తరాయణి
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ - సంక్రాంతి


మకర సంక్రాంతి ప్రత్యేకత, చేయాల్సిన పనులు:
 తెలుగు రాష్ట్రాలల్లో మకర సంక్రాంతిని ప్రజలు ఎంతో ఉత్సహంగా జరుపుకుంటారు. అయితే కొత్తగా పండించిన పంట ఇంటి రావడంతో ఈ పండగను జరుపుకుంటారని ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా ఈ పండగ ప్రకృతికి, రైతులకు ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ పండగ ప్రకృతి పండగగా భావిస్తారు. మకర సంక్రాంతిని పల్లె ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి.. తల స్నానాలు చేసి పట్టు వస్త్రాలు ధరించి పూజ కార్యక్రమాలు పాల్గొంటారు. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత వస్తువులు దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అయితే ఈ కింది రాశులవారు వీటిని దానం చేయండంలో జీవితంలో చాలా రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఏం దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


మకర సంక్రాంతి రోజు ఈ రాశిలవారు వీటిని దానం చేయండి:
మేషం: బెల్లం తీపి, వేరుశెనగ, నువ్వులతో బెల్లం
వృషభం: అన్నం, పెరుగు, తెల్లని బట్టలు, నువ్వులు
మిథునం: బియ్యం, తెలుపు మరియు ఆకుపచ్చ దుప్పటి, పప్పు
కర్కాటకం: వెండి, తెల్ల నువ్వులు లేదా కర్పూరం
కన్య: ఆకుపచ్చ దుప్పటి, ఖిచ్డి
తులారాశి: చక్కెర , తెల్లని వస్త్రం, ఖీర్, కర్పూరం
వృశ్చికం: ఎరుపు వస్త్రం, నువ్వులు
ధనుస్సు: పసుపు వస్త్రం, బంగారం
మకరం: నల్ల దుప్పటి, నల్ల నువ్వులు, టీ
కుంభం: ఖిచ్డీ, నువ్వులు, కిడ్నీ బీన్స్
మీనం: పట్టు వస్త్రం, పప్పు, నువ్వులు


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి