Margashirsha Purnima 2022: మార్గశిర పౌర్ణమి రోజూ ఈ సమయాల్లో పూజలు చేయాల్సి ఉంటుంది.. ఎందుకో తెలుసా..?
Margashirsha Purnima 2022: మార్గశిర పౌర్ణమి రోజు శ్రీకృష్ణునికి ఉపవాసాలు పాటించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబంలో శాంతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Margashirsha Purnima 2022: పురాణాల ప్రకారం మార్గశిర మాసం కృష్ణునికి ఎంతో ఇష్టమైన నెల. ముఖ్యంగా ఈ మాసంలోని పౌర్ణిమ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. పౌర్ణమి రోజున శ్రీకృష్ణుని పూజించి ఉపవాసాలు పాటిస్తే కోరుకున్న కోరికలు నెరవేరి పుణ్యాలు లభిస్తాయని పురాణాల్లో వివరించారు. అయితే ఈసారి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రెండు రోజులు రావడంతో ఏయే రోజులోనని గందరగోళంలో ఉండిపోయారు కొందరు. అయితే ఏ తేదీల్లో జరుపుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మార్గశిర మాస పౌర్ణమి శుభ ముహూర్తాలు:
హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 7న మార్గశిర పౌర్ణమి తిధి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి సమయం డిసెంబర్ 8వ తారీఖున ఉదయం 9:35 నిమిషాలకు ముగిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు ఇవే:
>>పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి.. పట్టు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.
>>ఆ తర్వాత శ్రీకృష్ణుని ప్రతిమలకు అభిషేకం చేసి మంచినీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన ప్రతిమలకు కుంకుమ పసుపుతో అలంకరించాలి.
>>శ్రీకృష్ణుని ప్రతిమలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నెయ్యితో దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన పనులను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
>>శ్రీకృష్ణునికి పండ్లు నైవేద్యంగా సమర్పించడమే కాకుండా తీపి పదార్థాలను కూడా నైవేద్యాలుగా సమర్పించవచ్చని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా నైవేద్యంగా సమర్పించిన తీపి పదార్థాలను నలుగురు లేదా ఐదుగురు ముత్తయిదులకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది.
>>మార్గశిర పౌర్ణమి రోజున ఇలా శ్రీకృష్ణునికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబంలో శాంతి నెలకొంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook