Mars Planet will Travel in LEO on 01st July 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. అంగారకుడు కూడా తన రాశిని మార్చనున్నాడు. జూలై 01న కుజుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్స్ రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. దైర్యానికి కారకుడైన కుజుడు రాశి మార్పు ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక సంచారం ఈ రాశులకు వరం


తులారాశి
కుజుడు రాశి మార్పు తులరాశి వారికి కలిసి వస్తుంది. మీ రాశిచక్రం యొక్క ఆదాయ గృహంలో కుజుడు సంచరించబోతున్నాడు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.  మీరు కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సామాజికంగా మీ పాపులారిటీ పెరుగుతుంది. పాత పెట్టుబడుల లభిస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీ ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తారు. 


మేషరాశి
అంగారక సంచారం మేషరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ జాతకంలో ఐదో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. ఇతడు ఆరోహణ మరియు ఎనిమిదో ఇంటికి అధిపతి. దీని కారణంగా మీలో ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. 


Also Read: Jupiter transit 2023: రాబోయే 11 నెలలపాటు ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం.. మీరున్నారా?


వృశ్చిక రాశి
కుజుడు రాశి మార్పు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ప్రతి పనిలో విజయం లభిస్తుంది.  మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 


Also Read: Ketu transit 2023: చిత్రా నక్షత్రంలోకి కేతువు.. ఈ 5 రాశులకు సమస్యలు షురూ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి