Mars Rise in Dhanu 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. కనుమ రోజు అంటే జనవరి 16, 2024న 23:07 గంటలకు కుజుడు ధనస్సు రాశిలో ఉదయించాడు. ఇతడిని ధైర్యం, భూమి, శౌర్యానికి కారకుడిగా భావిస్తారు. ధనుస్సు రాశిలో అంగారకుడు పెరగడంవల్ల నాలుగు రాశులవారు ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
ధనస్సు రాశిలో కుజుడు సంచారం కుంభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు డబ్బును భారీగా పొదుపు చేస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
మీన రాశి
అంగారకుడి సంచారం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు వెనువెంటనే పూర్తవుతాయి. మీ సంపదలో పెరుగుదల ఉంటుంది. మీ పేదరికం తొలగిపోతుంది. 
మిధునరాశి
ధనుస్సు రాశిలో కుజుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారు ప్రయోజనం పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.  మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ సంపద రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. 


Also Read: Mars And Mercury Conjunction: కుజ, బుధ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..


సింహరాశి
అంగారకుడి సంచారం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ సంపద భారీగా పెరుగుతుంది. మీకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే తగిన సమయం.


Also Read: Ayodhya Laddu: అయోధ్య బాలరాముడికి హైదరాబాద్ నుంచి 1265 కిలోల భారీ లడ్డూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook