Ayodhya Laddu: అయోధ్య బాలరాముడికి హైదరాబాద్ నుంచి 1265 కిలోల భారీ లడ్డూ

Ayodhya Laddu: మరో ఐదు రోజుల్లో అయోధ్య రామాలయం ప్రారంభం కానున్ననేపధ్యంలో దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. భక్తులు వివిధ రకాలుగా భక్తి చాటుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఓ భక్తుడు భారీ లడ్డూ సమర్పించనున్నాడు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2024, 01:42 PM IST
Ayodhya Laddu: అయోధ్య బాలరాముడికి హైదరాబాద్ నుంచి 1265 కిలోల భారీ లడ్డూ

Ayodhya Laddu: జనవరి 22న తేదీన అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. దేశ విదేశాల్నించి భారీగా ప్రముఖలు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రామాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు భక్తులు కూడా తమ భక్తిని వివిధ రూపాల్లో చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపధ్యంలో తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిని చాటుుకునేందుకు భారీ లడ్డూ తయారు చేయించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు అయోధ్య రాముని కోసం ప్రత్యేకంగా 1265 కిలోల లడ్డూ తయారు చేయించారు. ఈ లడ్డూను ఇప్పుడు అయోధ్యకు పంపించనున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం భూమి పూజ నుంచి రాముడి ప్రాణ ప్రతిష్ట వరకూ 1265 రోజుల సమయం పట్టింది. అందుకు గుర్తుగా 1265 కిలోల లడ్డూను తయారు చేయించారు. 

ఈ భారీ లడ్డూ తయారీలో 350 కిలోల శెనగపిండి, 700 కిలోల పంచదార, 40 కిలోల నెయ్యి, 40 కిలోల జీడిపప్పు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించారు. ఈ లడ్డూను రాముడి ఆలయానికి 50 మీటర్ల దూరంలో ఉంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. 

ఈ లడ్డూ తయారీకు శ్రీ రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అనుమతి పొందామని నాగభూషణం రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ లడ్డూ అయోధ్యకు చేర్చేందుకు శోభాయాత్ర ప్రారంభమైందని, ఈ నెల 21 నాటికి అయోధ్య చేరుకుంటుందన్నారు. 

Also read: Fact check: అయోధ్య రామాలయం, శ్రీరాముడి చిత్రాలతో కొత్త 500 రూపాయల నోటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News