Fact check: అయోధ్య రామాలయం, శ్రీరాముడి చిత్రాలతో కొత్త 500 రూపాయల నోటు

Fact check: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. ఇందుకు గుర్తుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 500 రూపాయల నోట్లు విడుదల చేయనుందా..సోషల్ మీడియాలో ఇప్పుడిదే వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2024, 12:52 PM IST
Fact check: అయోధ్య రామాలయం, శ్రీరాముడి చిత్రాలతో కొత్త 500 రూపాయల నోటు

Fact check: జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఆర్బీఐ రాముడి ఫోటో, బాణం, రామాలయం ఫోటోలతో కొత్త 500 రూపాయల నోట్లు విడుదల చేయనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే ఓ నోటు కూడా హల్‌చల్ చేస్తోంది. 

సోషల్ మీడియా ఉంటే చాలు..తిమ్మిని బమ్మి చేసేందుకు..బమ్మిని తిమ్మి చేసేందుకు . సోషల్ మమీడియాలో ఏ అంశమైనా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. నిర్ధారణ అవసరం లేదు. ఒకరు పోస్ట్ చేస్తే చాలు..అలా అలా షేరింగ్ అయిపోతుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. అది 500 రూపాయల నోటు. అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా ఆర్బీఐ కొత్త 500 రూపాయల నోటు విడుదల చేస్తోందనే ప్రచారం ప్రారంభమైంది. ఈ నోటు ఓ వైపు నెత్తిన కిరీటం, భుజనా బాణాలు, చేతిలో విల్లు ధరించిన శ్రీరాముని ఫోటో ముద్రించి ఉంది. వెనుకవైపు అయోధ్య రామాలయం పోటో, ఎక్కుపెట్టిన విల్లు ఉన్నాయి. 

ఏకంగా మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడిని, ఎర్రకోట స్థానంలో రామాలయం ముద్రించి ఉన్నాయి. సరిగ్గా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజున ఆర్బీఐ ఈ కొత్త 500 రూపాయల నోటు విడుదల చేయనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఆర్బీఐ ఎలాంటి కొత్త నోట్లు విడుదల చేయడం లేదని తెలిసింది. ఆర్బీఐ కూడా ఏ సమాచారాన్ని వెల్లడించలేదు. ఇదంతా అబద్ధపు ప్రచారం. గతంలో కూడా మహాత్మా గాంధీ స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోలతో కొత్త సిరీస్ నోట్లు వస్తున్నాయంటూ ప్రచారం సాగింది. ఆర్బీఐ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. 

Also read: Ayodhya Route: అయోధ్యకు ఏయే మార్గాల ద్వారా ఎలా చేరుకోవచ్చు, పూర్తి వివరాలు ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News