Budh Uday 2023: 14న బుధుడు ఉదయం... ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..
Budh Uday 2023: మరో 9 రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ ఖగోళ సంఘటన కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Rise 2023 effect: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల ఉదయించడం లేదా అస్తమించడం మెుత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం జరగబోతుంది. సాధారణంగా గ్రహాల ఉదయించడం శుభఫలితాలను ఇస్తే.. అస్తమించడం చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ నెల 14న బుధుడు మేషరాశిలో ఉదయించబోతున్నాడు. ఈ సంఘటన కారణంగా కొన్ని రాశుల యెుక్క అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి
బుధుడు ఉదయించడం వల్ల మేషరాశి వారికి లక్ కలిసి రానుంది. వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారులు లాభపడతారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
మెర్క్యూరీ రైజింగ్ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు చాలా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు.
సింహరాశి
బుధుడు ఉదయించడం వల్ల సింహరాశి వారికి అదృష్టం పట్టనంది. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం కలిసి వస్తుంది.
Also Read: Lunar Eclipse 2023: ఇవాళే తొలి చంద్ర గ్రహణం, ఆ 4 రాశులకు తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook