Lunar Eclipse 2023: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం బుద్ధ పౌర్ణిమ రోజున ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం చంద్ర గ్రహణానికి అశుభ సూచకంగా భావిస్తారు. ఫలితంగా కొన్ని రాశులవాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. లేకపోతే తీవ్రమైన ధనహాని కలుగుతుంది. ఆర్ధికంగా నష్టపోతారు.
2023 తొలి చంద్ర గ్రహణం మే 5వ తేదీ రాత్రి 8 గంటల 44 నిమిషాలకు ప్రారంభమై...6వవ తేదీ ఉదయం 1 గంట వరకూ ఉంటుంది. చంద్ర గ్రహణం కొన్ని రాశులవారికి అత్యంత అశుభంగా మారనుంది. అందుకే ఈ రాశులవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళే ఆ చంద్ర గ్రహమం ఏర్పడనుంది. అయితే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లోనే చంద్ర గ్రహణం వీక్షించవచ్చు. ఇండియాలో చంద్ర గ్రహణం కన్పించదు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈసారి ఏర్పడనున్న చంద్ర గ్రహణం ఇండియాలో ప్రభావం లేకపోయినా సూతక కాలానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్ని రాశులపై ప్రభావం శుభంగా లేదా అశుభంగా ఉంటుంది. చంద్ర గ్రహణం సందర్భంగా ఏయే రాశులు అప్రమత్తంగా ఉండాలి, ఏం జరగనుందో తెలుసుకుందాం..
తుల రాశి
తుల రాశి జాతకులకు ఈ చంద్ర గ్రహణం వర్తించదు. ఈ రాశివారికి చంద్ర గ్రహణం ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తుంది. తుల రాశి జాతకులు ఏదైనా ఖర్చు చేయాలంటే ఆలోచించి చేయాల్సి ఉంటుంది. వాహనాల ద్వారా ప్రమాదం ఏర్పడవచ్చు లేదా ఏదైనా దుర్ఘటనకు గురి కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
వృషభ రాశి
జ్యోతిష్యం ప్రకార ఈసారి ఏర్పడనున్న చంద్ర గ్రహణం ఎవరికీ శుభంగా ఉండదు. ఈ సందర్భంగా కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. మనస్సంతా అశాంతితో నిండి ఉంటటుంది. కోరుకున్న ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. ఆర్ధికంగా బలపడేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్ధులకు అంత అనుకూలమైన సమయం కాదు. అలాగని నిరాశ చెందవద్దు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
మీన రాశి జాతకులకు చంద్ర గ్రహణం కారణంగా మిశ్రమ ఫలితాలుంటాయి. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి వస్తుంది. మీన రాశి జాతకులకు మానసికంగా ఇబ్బందులు ఎదురౌతాయి. గ్రహణం సందర్భంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులపై చంద్ర గ్రహణం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే చోట పరాభవం ఎదుర్కోవల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్దిక పరిస్థితి వికటిస్తుంది. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిరాశ ఆవహించకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ధనహాని తీవ్రంగా ఉంటుంది.
చంద్ర గ్రహణం దుష్ప్రభావం నుంచి ఎలా కాపాడుకోవాలి
చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడిని ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమహ, ఓం సోం సోమాయ నమహ మంత్రాలతో సాధ్యమైనంత ఎక్కువగా కీర్తించాలి. ఇలా చేయడం వల్ల చంద్రుడి నెగెటివ్ ప్రభావం తొలగిపోతుంది. చంద్ర గ్రహణం రోజున కొబ్బరికాయతో నెత్తిపై నుంచి 21 సార్లు దిష్టి తీయాలి. ఆ తరవాత ప్రవహించే నీటిలో ఆ కొబ్బరికాయను పాడేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook