Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహాన్ని తర్కం, బుద్ధికి ప్రతిగా భావిస్తారు. అలాంటి బుధ గ్రహం కొద్దిరోజుల్లో మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై ఊహించనంత అద్భుతంగా ఉంటుంది. మొత్తం జీవితమే మారిపోనుంది. అపారమైన ధన సంపద కలుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు మే 10వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. కుండలిలో బుధుడు పటిష్టంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఆరోగ్యం, సంతృప్తి, బుద్ధి లభిస్తాయి. ఇలాంటి వ్యక్తులు తమ దైనందిన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుండలిలో బుధుడు మంగళ గ్రహం లేదా రాహు-కేతువులతో కలిసి ఉంటే ఆ వ్యక్తి జీవితంలో తీరని కష్టాలు ఎదురౌతాయి. బుధుడు త్వరలోనే అంటే మే 10వ తేదీన మేషరాశిలో గోచారం చేయనున్నాడు. ఫలితంగా 4 రాశుల జీవితంలో ధన సంపదలు ప్రాప్తించనున్నాయి. పనిచేసేచోట కొత్త బాధ్యతలు లేదా మంచి వేతనం లభిస్తుంది. 


కుంభ రాశి


బుధుడు మేషరాశిలో ఉదయించడం ఈ రాశివారికి మంచి ఫలితాలనిస్తుంది. ఈ సందర్భంగా మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పదోన్నతి ఉంటుంది. పని నిమిత్తం విదేశాలు వెళ్లే అవకాశం ఉంటుంది. సొంత వ్యాపారం చేసేవారి జాతకంలో ధనలాభం కలుగుతుంది. కొత్త వాహనం, లేదా సంపద కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడులు లాభాల్ని ఆర్జిస్తాయి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు.


మిథున రాశి


మిధున రాశి జాతకులు తమ పనిలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వీరి పనితీరును తోటి ఉద్యోగులు, పై అధికారులు ప్రశంసిస్తారు. పదోన్నతి, మంచి ఇంక్రిమెంట్ లభిస్తుంది. మిథున రాశి జాతకుల కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ధనార్జనకు చాలా అనువైన సమయం. గతం కంటే మంచి స్థితిలో ఉంటారు. సరైన ప్లానింగ్ కారణంగా మీ పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. జీవితం మొత్తం మారిపోతుంది. 


మేష రాశి


బుధుడు గోచారంతో మేషరాశిలోనే ప్రవేశించనున్నాడు. ఫలితంగా ఈ రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యక్తిగత జీవితంలో, కెరీర్‌లో రాణించేందుకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారులు అవుట్ సోర్సింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. 


వృశ్చిక రాశి


ఈ సమయం వృశ్చిక రాశివారికి కాస్త సవాళ్లతో కూడుకున్నది. పని ఒత్తిడి గతం కంటే అధికంగా ఉంటుంది. ఫలితంగా మెరుగైన పనితీరు చూపించడంలో కాస్త ఇబ్బంది ఎదురౌతుంది. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితంగా ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. దాంతో ఆరోగ్యం పాడవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆర్ధికంగా మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. గతం కంటే మంచి స్థితిలో ఉంటారు. 


Also Read: Chaturgrahi Yog: మేషరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులపై కనక వర్షం..


Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook