Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహం మార్చ్ 16వ తేదీనే మీనరాశిలో ప్రవేశించాడు. బుధుడి రాశి పరివర్తనంతో నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఫలితంగా 4 రాశులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ ధర్మశాస్త్రంలో జ్యోతిష్యానికి చాలా మహత్యముంది. అందుకే జ్యోతిష్యశాస్త్రం చెప్పే మాటల్ని అందరూ పాటిస్తుంటారు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా భావిస్తారు. బుధుడు ఇటీవలే అంటే మార్చ్ 16వ తేదీన మీనరాశిలో ప్రవేశించాడు. దాంతో ఏర్పడిన నీచభంగ రాజయోగం కారణంగా 12 రాశులపై ప్రభావం కన్పిస్తోంది. ముఖ్యంగా 4 రాశులకు మాత్రం అదృష్టం తిరగదోడుతోంది. ఊహించని లాభాలు కలుగుతున్నాయి. ఆకస్మిక ధనలాభం, అన్నింటా విజయం లభిస్తాయి.


కన్యా రాశి


కన్యారాశి జాతకులకు బుధుడి మీన రాశి ప్రవేశంతో ఏర్పడిన నీచభంగ రాజయోగం కారణంగా చాలా ప్రయోజనం కలుగుతోంది. హంస రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల లాభాలు రెట్టింపు అవుతాయి. ధనలాభం ఉండటంతో ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉండేవారికి ఇక తిరుగే ఉండదు. 


వృషభ రాశి


బుధుడి మీనరాశి ప్రవేశంతో ఏర్పడిన నీచభంగ రాజయోగం కారణంగా వృషభరాశి జాతకులకు అత్యంత శుభ పరిణామంగా ఉంటుంది. ఈ రాశివారి ఆదాయంలో అద్భుతమైన వృద్ధి ఉంటుంది. అన్ని ఆర్ధికపరమైన కష్టాలు తొలగిపోతాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. పదోన్నతి లభిస్తుంది. 


ధనస్సు రాశి


బుధుడి మీన రాశి ప్రవేశం, నీచభంగ రాజయోగం కారణంగా ధనస్సు రాశి జాతకులకు అద్భుతమైన లాభాలున్నాయి. కొత్త ఇళ్లు లేదా వాహనం లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థుల సమస్యలు దూరం కానున్నాయి. ప్రత్యర్ధులు ఓటమి పాలవుతారు. 


మిథున రాశి


బుదుడి గోచారంతో ఏర్పడే నీచభంగ రాజయోగం అత్యంత లాభదాయకం కానుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కోరుకున్న ప్రాంతానికి బదిలీ ఉంటుంది. విదేశీ యాత్ర చేసే అవకాశాలున్నాయి. 


Also read: Jupiter Moon Conjunction 2023: మరో 48 గంటలాగితే..రాజకేసరి యోగంతో ఆ 3 రాశులపై కనకవర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook