Mercury Transit 2023: మరో పది రోజుల తరువాత ఈ 4 రాశులకు వద్దంటే డబ్బు, ఐశ్వర్యం
Mercury Transit 2023: జ్యోతిష్య ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఆ ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
హిందూమతం జ్యోతిష్యం ప్రకారం బుధుడి గోచారం ప్రభావం కీలకంగా ఉంటుంది. మార్చ్ 16వ తేదీన అంటే మరో పదిరోజుల్లో బుధుడు మీన రాశిలో ప్రవేశిస్తుండటం కొన్ని రాశులకు అదృష్టం తోడుగా నిలవనుంది. అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఆ వివరాలు మీ కోసం..
బుధుడిని వాయిస్, బుద్ధి, ధన వ్యాపారాలకు కారకుడిగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. బుధుడు 23 రోజుల్లో రాశి మారుతుంటాడు. బుధుడు ఎప్పుడు గోచారం చేసినా బుద్ధి, వ్యాపారం, ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈసారి బుధ గ్రహం మార్చ్ 16 వతేదీన గోచారం చేయనుండటం, మీన రాశిలో ప్రవేశించనుండటం, గురు గ్రహం అప్పటికే మీన రాశిలో ఉండటం కారణంగా బుధ, గురు గ్రహాల యుతి ఏర్పడుతుంది. ఈ గ్రహ స్థితి కొన్ని రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఏయే రాశులకు లాభదాయకమో తెలుసుకుందాం..
బుధుడి గోచారంతో ఈ రాశులకు లాభం
మిధున రాశి
బుధుడి గోచారంతో అత్యంత ఎక్కువగా లాభపడేది ఈ రాశి జాతకులే. మిధున రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ జాతకం వారి కెరీర్, ఆర్ధిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వృత్తి జీవితానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మేష రాశి
బుధ గ్రహం గోచారంతో మేషరాశి వారికి చాలా లాభముంటుంది. ఈ జాతకుల కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. కీలక విజయాలు దక్కుతాయి. అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఊహించని ధనలాభముంటుంది.
వృశ్చిక రాశి
బుధుడి రాశి పరివర్తనం ప్రభావం వృశ్చిక రాశి జాతకులకు శుభం కలగనుంది. వృత్తి జీవితంలో లాభాలు ఆర్జిస్తారు. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చెడిన పనులు కూడా పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే నష్టాలు ఎదురౌతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి బుధుడి అస్తమించడం గోచారం ప్రభావంతో కెరీర్‌పరంగా లాభాలు కలుగుతాయి. ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాల యోగం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. పెట్టుబడులు ఆలోచించి తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook