Venus Transit 2023: శుక్రుడి గోచారం అంత పవర్ ఫుల్లా, ఆ 4 రాశులకు మార్చ్ 12 ఉదయం 8 గంటల్నించి ఏం జరగనుంది

Venus Transit 2023: హిందూమతం ప్రకారం జ్యోతిష్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలు రాశి మారడం, గోచారం ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా ఉంటుంది. కొన్ని రాశులపై సానుకూలమైతే..మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2023, 06:23 AM IST
Venus Transit 2023: శుక్రుడి గోచారం అంత పవర్ ఫుల్లా, ఆ 4 రాశులకు మార్చ్ 12 ఉదయం 8 గంటల్నించి ఏం జరగనుంది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు మార్చ్ 12 వతేదీన గోచారముంది. దీని ప్రభావంతో 4 రాశుల జాతకులకు దశ మారిపోనుంది. ఊహించని అంతులేని ధనవర్షం ఇంట కురవనుంది. శుక్రుడి గోచారంతో ఏ 4 రాశులకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం..

హిందూ జ్యోతిష్యం ప్రకారం శుక్రగ్రహాన్ని సంసార సుఖాలకు కారకుడిగా భావిస్తారు. ఐశ్వర్యం, డబ్బు అంతా ఈ గ్రహం వల్లే సంభవిస్తుందని నమ్మకం. మార్చ్ 12వ తేదీ శుక్రుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల 4 రాశుల జీవితంలో పాజిటివ్ పరిణామాలు రానున్నాయి. ఈ నాలుగు రాశుల ఇంట ఊహించని ధనలాభం కలగనుంది. శుక్రగ్రహాన్ని ప్రకృతి సౌందర్యం, ఐశ్వర్యం, వైభవాలకు ప్రతీకగా భావిస్తారు. శుక్రుడు ఎప్పుడు గోచారం చేసినా ఆ ప్రభావం కీర్తి ప్రతిష్టలు, జీవితంలో వృద్ధి, భౌతిక సుఖాలు, వైవాహిక జీవితంలో సుఖం పొందడంపై ఉంటుంది. ఈసారి శుక్రుడు మార్చ్ 12 వ తేదీ ఉదయం 8 గంటల 13 నిమిషాలకు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులకు కటాక్షం లభించనుంది. ఈ రాశుల ఇంట లగ్జరీ వస్తువులుంటాయి. విదేశీయాత్ర యోగం ఏర్పడుతుంది. ఆ 4 రాశులేంటనేది తెలుసుకుందాం..

శుక్రుడి గోచారంతో ప్రభావితమయ్యే రాశులు

కుంభ రాశి

ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఏదైనా తీర్ధయాత్రకు వెళ్లవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేయడంలో సమర్ధులు. రచయితలకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న మీ కోర్కెలు నెరవేరుతాయి. గురువులు, తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో మీ ఆసక్తి పెరుగుతుంది.

మేష రాశి

శుక్రుడు మేష రాశిలో ప్రవేశించడం వల్ల జీవిత భాగస్వామతితో మీ బంధం బాగుంటుంది. మీ పర్సనాలిటీ ఆకర్షణీయమై సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చాలా లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయగలరు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో చాలావరకూ పరిష్కారం లభిస్తుంది. 

సింహ రాశి

శుక్రుడి గోచారం ప్రభావం కొత్త అవకాశాలు తీసుకొస్తుంది.  మీకిష్టమైన కెరీర్ ప్రారంభిస్తారు. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి విజయం లభిస్తుంది. సోదర సోదరీమణుల మధ్య పరస్పరం ప్రేమ, సహకారం పెరుగుతుంది. 

కన్యా రాశి

ఈ రాశివారికి శుక్రుడి గోచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అత్తారింటి తరపున సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. తండ్రి తరపున సంపద లభిస్తుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయం పెరగడం వల్ల ధన సంపదల్లో వృద్ధి లభిస్తుంది. కుటుంబపెద్దల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలి.

Also read: Shani Uday 2023: కుంభంలో ఉదయించిన శని.. ఈ రాశులకు తిరుగులేని మనీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News