Mercury Transit 2023: హిందూ పంచాంగాల ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశిత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించడమే కాకుండా ఒక్కోసారి ఇతర గ్రహాలతో కలిసి యుతి ఏర్పరుస్తుంటాయి. ఫలితంగా అన్నిరాశులపై ప్రభావం పడుతుంది. జూన్ నెలలో చాలా గ్రహాలు రాశి పరివర్తనం చెందనున్నాయి. బుధుడు వృషభ రాశిలో జూన్ 7న ప్రవేశించనున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ నెల జ్యోతిష్యపరంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఈ నెలలో చాలా గ్రహాల పరివర్తనం లేదా గోచారముంది. జూన్ నెలలో గ్రహాల గోచారంతో పాటు గ్రహాల అస్తమయం, ఉదయం, వక్రమార్గం వంటివి కూడా ఉన్నాయి. జూన్ 7వ తేదీన బుధుడు వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. వృషభరాశిలో జూన్ 24 వరకూ ఉంటాడు. ఆ తరువాత మిధున రాశిలో ప్రవేశిస్తాడు. బుధుడి వృషభరాశి ప్రవేశంతో కొన్ని రాశులవారికి అంతా శుభం కలగనుంది. కొంతమంది చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. 


సింహ రాశి జాతకులపై బుధుడి గోచారం ప్రభావం ప్రతికూలంగా ఉండనుంది. ఈ సమయంలో అంటే జూన్ 7 నుంచి జూన్ 24 వరకూ ఉండే బుధుడి వృషభ రాశి కాలంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఏదైనా కొత్త పనులు ప్రారంబించే ఆలోచన ఉంటే మానుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఇది అనువైన సమయం కానే కాదు. బుధుడి గోచారంతో ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. ఈ సమయంలో ఏ పని చేసినా సాఫల్యం లభించదంటారు. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ప్రతి బుధవారం నాడు వ్రతం ఆచరించాలి. దాంతో పాటు విష్ణు భగవానుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. బుధగోచారం దుష్ప్రభావం తగ్గుతుంది. 


జ్యోతిష్యం ప్రకారం జూన్ 7వ తేదీన బుధుడు వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల చాలా రాశులకు ప్రయోజనం కలగనుంది. కొంతమంది మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా మిధున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి పనులు కొన్ని నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో ఆర్దిక లావాదేవీలు జరపకుండా ఉంటే మంచిది. లేకపోతే నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడా ఏ విధమైన పెట్టుబడులు ఈ సమయంలో పెట్టవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఏ నిర్ణయాన్నీ తొందరపాటులో తీసుకోకూడదు. 


బుధుడి గోచారం సందర్భంగా జూన్ 7 నుంచి జూన్ 24 వరకూ 17 రోజులు అత్యంత కీలకం. ఈ రోజుల్లో గణపతి పూజలు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కష్టాలు తొలగి సుఖం లభిస్తుంది. వీలైతే బుధవారం నాడు వ్రతం ఆచరించాలి.


Also read: Sun transit 2023: సూర్యుడి మిధునరాశి ప్రవేశం, జూన్ 15 నుంచి ఈ 4 రాశులకు మహర్దశే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook