Vaikunta Ekadasi 2023: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి...ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
Vaikunta Ekadasi 2023: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Vaikunta Ekadasi 2023: సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజున వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే నుంచే శ్రీహరి దర్శనానికి వేచి ఉంటారు. ఇవాళ శ్రీమహావిష్ణువు గరుడు వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఒక్క ఏకాదశిని పాటిస్తే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈరోజే సాగరమథనం నుంచి హాలాహలం, అమృతం పట్టాయని.. శ్రీకృష్ణుడు భగవద్గీతను ఇదే రోజున ఉపదేశించాడని నమ్ముతారు.
ఈరోజు ఉపవాసం చేస్తూ వైకుంఠ ఏకాదశిని ఆచరించన వారు సర్వపాపాల నుండి విముక్తి పొందుతారు. ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం చేసేవారికి మరణించిన అనంతరం వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి జనవరి 2న వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా మెుదలయ్యాయి. ఈ పండుగను పురస్కరించుకొని ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తిరుమల, సింహాచలం,విజయవాడ, యాద్రాద్రి, భద్రాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనాలు అర్ధరాత్రి 12.05 గంటలకే ప్రారంభించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా తదితరులు స్వామి వారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
Also Read; Shiva Puja Vidhi: శివలింగానికి నీటిని సమర్పించే విధానాలు.. పాత్ర, ముఖ దిశ, మంత్రం వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.